Begin typing your search above and press return to search.

అడ్డాల అందరితోను ఎందుకు కలవడో తెలుసా..?

By:  Tupaki Desk   |   9 May 2016 11:30 AM GMT
అడ్డాల అందరితోను ఎందుకు కలవడో తెలుసా..?
X
బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో మహేష్ డైరెక్టర్ అడ్డాలను ఉద్దేశించి ఒక మాట అనేశాడు.ఆ మాట అన్నవెంటనే అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ మహేష్ అన్నమాట ఏంటో తెలుసా. శ్రీకాంత్ మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న పర్సన్ . పరిశ్రమలో అందరితోను కలవడు. అందుకేనేమో అంత మంచిగా ఉంటాడు అని. మహేష్ తన డైరెక్టర్ గురించి తనకు ఉన్న ఒపీనియన్ ఏంటో చెప్పేసి కామైపోయాడు. అయితే శ్రీకాంత్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. ఎట్ ది సేమ్ టైమ్ ఎంటెక్ చేసిన శ్రీకాంత్ ను ఉద్దేశించి గతంలో డైరెక్టర్ వినాయక్ కూడా ఇలాగే ఓ మాట అన్నారు. అయితే శ్రీకాంత్ గురించి వాస్తవాలు తెలుసుకుంటే అతను ఎందుకు ఎవరితో కలవడు అనే విషయం అర్ధమవుతుంది.

స్టూడెంట్ గా ఉన్న టైమ్ నుంచి తన ఊరు రేలంగిలో మనోడు చాలా సైలెంట్ గానే ఉండేవాడు.ఏం చేసినా అతని చేతల్లో అతి ఉండేది కాదు."ఎంటెక్ చేసిన నువ్వేంట్రా ఈ డ్రెస్సింగ్" అని.... గతంలో కొందరు కొన్ని మాటలు అన్నప్పటికీ తనకు నచ్చిన రీతిలోనే అతను జీవనం గడిపేవాడు తప్ప స్టైల్ - ట్రెండ్ అంటూ ఏనాడు హడావిడి చేసేవాడు కాదట.

మ్యాక్జిమ్ సింపుల్ గా ఉండడానికే అతను ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు.అలాగే శ్రీకాంత్ ఎక్కువగా ఆఫ్ మైండ్ లో ఉంటాడనే కామెంట్ కూడా ఒకటుంది.అయితే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవారు చాలామంది ఇలాగే ఉంటారనే విషయం తెలుసుకుంటే గనుక ..ఆఫ్ మైండ్ కాన్సెప్ట్ శ్రీకాంత్ విషయంలో పెద్ద ప్రాబ్లమే కాదు.సో శ్రీకాంత్ విషయంలో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న కామెంట్స్ కు మీకు సమాధానం దొరికినట్లే కదా.