Begin typing your search above and press return to search.

అసుర‌న్ రీమేక్.. చెప్పిందే జ‌రిగింది!

By:  Tupaki Desk   |   18 Nov 2019 2:09 PM GMT
అసుర‌న్ రీమేక్.. చెప్పిందే జ‌రిగింది!
X
త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన `అసుర‌న్‌` ఇటీవ‌ల విడుద‌లైన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు సొంతం చేసుకున్నారని.. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించే ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తుపాకి డాట్‌ కామ్ ఇదివ‌ర‌కూ వెల్ల‌డించింది. తాజా స‌మాచారం మేర‌కు అది నిజ‌మైంది.

అసుర‌న్ చిత్రాన్ని ప‌క్కాగా తెలుగులో రీమేక్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఎవ‌రున్నారు అంటూ నిర్మాత డి.సురేష్‌ బాబు అన్వేష‌ణ మొద‌లుపెట్టారు. ఆ క్ర‌మంలోనే తెలుగు రీమేక్ ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల పేర్లు రోజుకొక‌టి చొప్పున‌ వినిపించ‌డం మొద‌లైంది. ఇటీవ‌ల హ‌ను రాఘ‌వ‌పూడి పేరు ప్ర‌ధ‌మంగా వినిపించింది. ఈ వార్త‌లు విన్న సురేష్ బాబు ఫైన‌ల్ గా ఈ చిత్ర రీమేక్ ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడి పేరుని ఫైన‌ల్ చేసేశారు.

శ్రీ‌కాంత్ అడ్డాలను ద‌ర్శ‌కుడిగా క‌న్ ఫామ్ చేస్తూ మీడియా వ‌ర్గాల‌కు డి.సురేష్‌ బాబు వివ‌రాల్ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ని కూడా వెల్ల‌డించ‌బోతున్నామ‌ని.. ఈ స‌బ్జెక్ట్ కు శ్రీ‌కాంత్ అడ్డాల అయితేనే బాగుంటుంద‌ని.. వెంక‌టేష్-నేను నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. త‌మిళ మాతృక క‌థ‌లో ఫ్లేవ‌ర్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని.. అయితే తెలుగు వెర్ష‌న్ లో కులాల ప్ర‌స్థావన కొంత త‌గ్గిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించిన‌ట్లు తెలిసింది.