Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ ఫ్యామిలీ లవ్‌లీ పిక్

By:  Tupaki Desk   |   21 March 2017 1:51 PM GMT
శ్రీకాంత్ ఫ్యామిలీ లవ్‌లీ పిక్
X
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తన స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తి. చిన్నాచితకా పాత్రల నుంచి హీరో స్థాయి వరకూ ఎదిగాడు. ఇప్పుడు హీరోగా కొనసాగుతూ కూడా.. మధ్యమధ్యలో కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. త్వరలో విలన్ గా కూడా శ్రీకాంత్ తన కొత్త రూపం చూపించనున్నాడనే టాక్ ఉంది.

తాజాగా శ్రీకాంత్ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఫోటోలో బంధించి.. ఆ లవ్లీ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. శ్రీకాంత్ భార్య.. మాజీ హీరోయిన్ ఊహ అనే విషయం అభిమానులకు తెలిసిందే. అప్పట్లోనే కలిసి సినిమాలు చేస్తూ ప్రేమించుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒకటిగా మారారు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు రోషన్.. ఆ తర్వాత కుమార్తె మేథ.. చిన్న కుమారుడు రోహన్ లు శ్రీకాంత్-ఊహల ముద్దుల సంతానం. భార్యాభర్తలు ఇద్దరూ.. ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోను నెట్ లో షేర్ చేసిన శ్రీకాంత్.. మై ఫ్యామిలీ అంటూ సింపుల్ ట్వీట్ తో ఆకట్టుకున్నాడు.

తాజాగా శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ సినిమాల్లో హీరోగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ మూవీతో నాగార్జునతో కలిసి రోషన్ నటించగా.. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలో మరో మంచి సబ్జెక్టుతో ఈ కుర్రాడు మరో ప్రయత్నం చేయనున్నాడని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/