Begin typing your search above and press return to search.

'ద‌స‌రా' ద‌ర్శ‌కుడితో మెగాస్టార్!

By:  Tupaki Desk   |   7 Jun 2023 7:00 AM GMT
ద‌స‌రా ద‌ర్శ‌కుడితో మెగాస్టార్!
X
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌డం కోసం సీనియ‌ర్ ద‌ర్శ‌కుల నుంచి జూనియ‌ర్ ద‌ర్శ‌కుల వ‌ర‌కూ పెద్ద జాబితానే క్యూలో ఉంది. వాళ్ల ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టే చిరు సైతం కొత్త వాళ్ల‌తో ప‌నిచేయ‌డానికి నేను సైతం సిద్దం అంటున్నారు. కొత్త క‌థ‌లు రెడీగాఉంటే విన‌డానికి రెడీ..మెప్పించ‌డానికి మీరు సిద్ద‌మా? అంటూ స‌వాల్ విసురుతున్నారు. నాకు ..మీకు న‌చ్చితే సెట్స్ కి వెళ్లిపోవ‌డ‌మే ఆల‌స్యం అన్న తీరున మాట్లాడుతున్నారు. ఇటీవ‌లి కాలంలో కొత్త ద‌ర్శ‌కుల స‌క్సెస్ రేట్ బాగుంది.

సీనియ‌ర్ల క‌న్నా జూనియ‌ర్లే కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేసి మోత మోగిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఇప్పటికే చిరంజీవిని కలిసి లైన్ వినిపించిన వారు కొంద‌రున్నారు. వశిష్ట‌..క‌ళ్యాణ్ కృష్ణ‌..బీవీఎస్ ర‌వి.. ప్ర‌సన్న కుమార్ బెజ‌వాడ‌..మారుతి లాంటి వారున్నారు.

వీరంతా ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేసే బిజీలో ఉన్నారు. తాజాగా ఈ వ‌రుస‌లోకి 'ద‌స‌రా' ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కూడా చేరాడు. ఇటీవ‌లే శ్రీకాంత్ కూడా చిరుకి లైన్ వినిపించారుట‌. న‌చ్చ‌డంతో డెవ‌లెప్ చేయ‌మ‌ని చెప్పారుట‌. దీంతో శ్రీకాంత్ ఆ ప‌నుల్లో ఉన్న‌ట్లు తెలిసింది.

అయితే ఇక్క‌డో ఇంట్రెస్టింగ్ విష‌యం ఉంది. శ్రీకాంత్ ని చిరు ఇంటికి పిలిపించిన సంద‌ర్భంలో ఇది జ‌రిగింద‌ని స‌మాచారం. 'ద‌స‌రా' స‌క్సెస్ త‌ర్వాత శ్రీకాంత్ ని చిరు ఇంటికి ఆహ్వానించి మాట మంతి చేసారుట‌.

ఆస‌మ‌యంలోనే మంచి స్టోరీ ఏదైనా ఉంటే చెప్పు అన‌గానే..అప్ప‌టికే ఐడియా ఉన్న లైన్ వినిపంచాడుట శ్రీకాంత్. పాయింట్ బాగుంది డెవ‌లెప్ చేయ్ అని అప్పుడే చెప్పారుట‌. దీంతో శ్రీకాంత్ అప్ప‌టి నుంచి అదే ప‌నిలో ఉన్న‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది.

మిగ‌తా వారికంటే శ్రీకాంత్ స్టోరీపైనే చిరు ఎక్కువ‌గా ఆస‌క్తిగా ఉన్నారుట‌. స్టోరీ ప‌క్కాగా ఉంటే చిరు-శ్రీకాంత్ తోనే ముందు సినిమా చేసే అవ‌కాశం ఉంది. తొలి సినిమా 'ద‌స‌రా'తోనే 100 కోట్లు రాబ‌ట్టిన ద‌ర్శ‌కుడీయ‌న‌. తొలి సినిమా అయినా సీనియ‌ర్ మేక‌ర్ ప‌నిత‌నం క‌నిపించింది. కొత్త ద‌ర్శ‌కుడు అనే భావ‌న ఎక్క‌డా క‌ల‌గ‌కుండా ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌డంలో నూరుశాతం స‌క్సెస్ అయ్యాడు. కాబ‌ట్టి చిరు-శ్రీకాంత్ ప్రాజెక్ట్ ని ఉన్న ప‌ళంగా ప‌ట్టాలెక్కించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.