Begin typing your search above and press return to search.

విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్..!

By:  Tupaki Desk   |   22 Nov 2022 8:07 AM GMT
విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్..!
X
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక సెలబ్రిటీ జంటలు తమ వైవాహిక జీవితాలకు స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. గడచిన కొన్ని నెలల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ - కోలీవుడ్ వరకు ప్రేమ వివాహం చేసుకున్న పలువురు సినీ జంటలు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ జంట శ్రీకాంత్ - ఊహ కూడా విడాకులు తీసుకోనున్నట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

కుటుంబానికి సన్నిహితులైన పెద్దలు జోక్యం చేసుకుని ఈ వయసులో విడిపోవడం మంచిది కాదని నచ్చజెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనూ - ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. కొన్ని వెబ్సైట్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారంలో ఉన్న పుకార్లను ఖండించారు.

శ్రీకాంత్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. "ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. 'ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు.. ఆందోళన పడవద్దు' అని తనను ఓదార్చాను'' అని చెప్పారు.

''అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్ మరియు యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే.. వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది''

''ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్ - యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ హీరో శ్రీకాంత్ ఓ ప్రకటన ద్వారా తన వైవాహిక బంధంపై వచ్చిన పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు.

కాగా, 'ఆమె' 'కూతురు' 'ఆయన గారు' వంటి చిత్రాల్లో హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన శ్రీకాంత్ - ఊహ.. ప్రేమించుకొని 1997లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. వీరికి రోషన్ - రోహన్ అనే ఇద్దరు కుమారులతో పాటుగా.. మేధ అనే కుమార్తె కూడా ఉంది. 'రుద్రమ దేవి' సినిమాతో రోషన్ మేక చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత 'నిర్మలా కాన్వెంట్' చిత్రంతో మెప్పించి.. 'పెళ్లి సందడి' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

మరోవైపు శ్రీకాంత్ మేకా సౌత్ ఇండస్ట్రీలో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారాడు శ్రీకాంత్. ఇప్పుడు మళ్ళీ విలన్ కమ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లి చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.