Begin typing your search above and press return to search.
2019 ఎన్నికలకు జాగ్రత్తలా?
By: Tupaki Desk | 26 Jan 2018 11:35 AM GMTరాజకీయా రంగంలో ఉన్న ట్విస్టులు మారే రంగంలో ఉండవని చెప్పవచ్చు. ఇక దర్శకులకు ఎంత తోడితే అంత అన్నట్టుగా అందులో కొత్త తరహా కథలు పుట్టుకొస్తాయి. అందుకే రచయితలు దర్శకులు ఎక్కువగా రాజకీయాలను సీక్రెట్ గా ఫాలో అవుతుంటారు. అందుకు సంబందించిన ఏ న్యూస్ వచ్చినా అందులో లో గుట్టును తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే 2019 ఎలక్షన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.
కొందరు డిఫెరెంట్ దారిలో వెళుతుంటే..శ్రీకాంత్ మాంత్రం సూటిగా వస్తానని ఒక పోస్టర్ తో చెప్పకనే చెప్పేశాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ప్రత్యేక పాత్రల్లో అలరిస్తోన్న శ్రీకాంత్ చాలా రోజుల తరువాత హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఆపరేషన్ 2019 అనే సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు.గతంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక దాదాపు అదే సినిమా ఛాయలు ఈ సినిమాకు కూడా కనిపిస్తున్నాయి.
బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్ లైన్ జనాలకు 2019 ఎలక్షన్స్ గురించి జాగ్రత్తలు చెబుతుందా అని అనిపిస్తోంది. ఎలక్షన్స్ కి ముందు నాయకులు ఓట్లను ఏ ప్లాన్ తో కొనుక్కుంటారో అందరికి తెలిసిందే. గ్రామాల్లో ఎక్కువగా నోట్ల కట్టలు మారుతుంటాయి. మద్యం కూడా ఓ రేంజ్ లో సప్లై అవుతుంది. కుల మాత ప్రాంతల ట్యాగ్ లైన్స్ తో నాయకులు జనాలను ఆకర్షిస్తారు. ఆఖరికి దైవన్నీ కూడా రాజకీయాల్లో వాడుకుంటారు. అయితే దాదాపు ఇదే అంశాలతో శ్రీకాంత్ సినిమా తెరకెక్కుతోందట. మరి శ్రీకాంత్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.