Begin typing your search above and press return to search.
నాకు కొడుకు బన్నీని చూస్తే చాలు-శ్రీకాంత్
By: Tupaki Desk | 11 April 2016 11:30 AM GMTతమకు ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. మెగా హీరోలు తమ ప్రతి సినిమాకూ చాలా కష్టపడతారని.. ఆ కష్టమే వాళ్లను పెద్ద స్థాయికి తీసుకెళ్తోందని అన్నాడు సీనియర్ హీరో శ్రీకాంత్. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ కు బాబాయిగా నటించిన శ్రీకాంత్.. ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టాన్ని తన కళ్లారా చూశానని అన్నాడు. పనిలో పనిగా బన్నీతో పాటు రామ్ చరణ్ ను కూడా కలుపుకుని తెగ పొగిడేశాడు శ్రీకాంత్.
‘‘ఇంతకుముందు రామ్ చరణ్ తో చేశాను. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేశాను. తమకు మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. వీళ్లు ఎక్కడా భేషజం చూపించలేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నేను కూడా వీళ్లలాగా సినిమా కోసం ఇంత కష్టపడలేదేమో అనిపిస్తుంది. వీళ్ల కష్టం చూస్తే సీనియర్లుగా మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సెట్లో బన్నీ డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఓ మెడిటేషన్ లాగా నటనను భావిస్తాడు. అంత ఫోకస్డ్ గా ఉంటాడు. బన్నీ.. రామ్ చరణ్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్.. మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా చాలా కష్టపడతారు. వీళ్లందరూ రేపటి తరానికి స్ఫూర్తి.
రేప్పొద్దున నా కొడుకే వస్తాడు.. అతడికి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లు లాంటివేమీ అవసరం లేదని చెబుతాను. ఒకసారి సెట్లోకి వచ్చి బన్నీ యాక్టింగ్ చూడు చాలు నీకే తెలుస్తుంది అంటాను. డైలాగ్ అయినా సరే.. డ్యాన్స్ మూమెంట్ అయినా సరే అంత బాగా చేస్తాడు బన్నీ. అన్నయ్య చిరంజీవితో చేస్తున్నపుడు నాకు చాలా భయంగా ఉండేది. ఆయనతో డ్యాన్స్ మూమెంట్ అనగానే వణుకొచ్చేసేది. బన్నీ విషయంలోనూ అదే జరిగింది. తనతో నాకో మూమెంట్ పెట్టారు. దాని గురించి చెబితే నాకిది అవసరమా అన్నాను. కానీ బన్నీ పట్టుబట్టి చేయించాడు. ఇంతకుముందు రుద్రమదేవిలో అతణ్ని చూసి షాకయ్యాను. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఇప్పుడు ‘సరైనోడు’లో కూడా బన్నీ ఇందులో ఓ కొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడు’’ అని శ్రీకాంత్ అన్నాడు.