Begin typing your search above and press return to search.
'సంక్రాంతి సందళ్లే' సాంగ్: సంక్రాంతి సందడి షురూ చేసిన 'శ్రీకారం' టీమ్..!
By: Tupaki Desk | 7 Jan 2021 11:30 AM GMTయువ హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం ''శ్రీకారం''. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శర్వా కి జోడీగా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ యువ రైతుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'శ్రీకారం' ప్రచార చిత్రాలు మరియు పెంచల్ దాస్ పాడిన 'భలేగుంది బాలా' సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి 'సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే' అంటూ సాగిన ఈ పాట పూర్తిగా పల్లెటూర్లలో పండుగ వాతావరణం కనిపించేలా రూపొందించారని తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ మంచి ట్యూన్ అందించాడు. 'మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా.. మన వారితో కలిసుండటం ఓ వరమేరా..' అంటూ దీనికి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించాడు. సింగర్స్ అనురాగ్ కులకర్ణి - మోహన భోగరాజు ఆలపించారు. ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ శోభి ఆధ్వర్యంలో శర్వా వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. భోగి మంటలు - హరిదాసులు - గాలిపటాలు - రంగులు రంగవల్లికలు - గంగిరెద్దుల - సన్నాయిలు వంటివి చూపిస్తూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తోంది.
మొత్తం మీద గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి నేపథ్యాన్ని తీసుకొని రూపొందించిన ఈ సాంగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.