Begin typing your search above and press return to search.
17 రోజుల్లో శ్రీమంతుడు 76 కోట్లు కొల్లగొట్టాడు
By: Tupaki Desk | 24 Aug 2015 9:24 AM GMTపోరా శ్రీమంతుడు.. పోప్పోరా శ్రీమంతుడు.. అంటే స్ర్టయిట్ గా ఆడియన్సు గుండెల్లోకి వెళ్ళిపోయాడు శ్రీమంతుడు. తన రేంజ్ మామూలుది కాదని చూపించేశాడు. మహేష్ చెప్పినట్లు.. కంటెంట్ లో మ్యాటర్ ఉంటే ఆటోమ్యాటిక్ గా సినిమాను ప్రేక్షకులు ఆదరించేస్తారు.. నిజానికి శ్రీమంతుడు విషయంలో అదే జరిగింది. కాస్త యావరేజ్ గా సెకండాఫ్ ఉన్నా సరే, మంచి పాయింట్ చెప్పాడు కాబట్టి జనాలకు బాగా నచ్చేసింది.
ఇక కలక్షన్ల విషయానికి వస్తే... శ్రీమంతుడు సినిమా 17 రోజుల్లో తెలుగు, తమిళ బాషల్లో కలుపుకొని 75.97 కోట్లు.. అంటే షుమారు 76 కోట్లు ''షేర్'' వసూలు చేసింది. ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ఇది రికార్డే. ఇప్పటివరకు బాహుబలి సినిమా తప్పించి ఇతర సినిమాల పేర్ల ఉన్న ''షేర్'' రికార్డులన్నీ శ్రీమంతుడు తిరిగరాసినట్లే. కేవలం తెలుగు వర్షన్ వరకు చూసుకున్నా కూడా.. సినిమా ఇండియాలో 60.72 కోట్ల షేర్ వసూలు చేయగా, అమెరికాలో 12 కోట్లు వచ్చింది. మొత్తానికి అన్ని బాషల్లోని రిలీజ్ కలిపి చూసుకుంటే.. తెలుగు సినిమాల వరకు సంబంధించి ఇది 3వ అతి పెద్ద వసూలు.. ఇక కేవలం తెలుగు బాష వరకే చూసుకుంటే మాత్రం శ్రీమంతుడు 2వ పొజిషన్ లో ఉంది.