Begin typing your search above and press return to search.

బాహుబ‌లికి 14.. శ్రీమంతుడికి 11

By:  Tupaki Desk   |   26 Nov 2015 11:54 AM GMT
బాహుబ‌లికి 14.. శ్రీమంతుడికి 11
X
ఇంత‌కాలం బాలీవుడ్ కి ప‌రిమిత‌మైన ఐఫా (ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడ‌మీ అవార్డు) అవార్డుల కార్య‌క్ర‌మం తొలిసారి ద‌క్షిణాది చిత్రాల‌కు ఎంట్రీ ఇవ్వ‌టం తెలిసిందే. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో నిర్వ‌హించ‌నున్న 15వ ఐఫా అవార్డుల కార్య‌క్ర‌మంలో తెలుగు.. త‌మిళ‌న‌.. క‌న్నడ‌.. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కూడా క‌లుపుకోవ‌టం తెలిసిందే.

తాజాగా తెలుగుకు సంబంధించి రెండు చిత్రాలు పెద్ద ఎత్తున వివిద విభాగాల్లో నామినేట్ కావ‌టం విశేషం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మైలురాయిగా భావిస్తూ.. తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన బాహుబ‌లి రికార్డు స్థాయిలో 11 విభాగాల్లో 14 మంది నామినేట్ అయితే.. ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు స‌రికొత్త ఛ‌రిష్మా తీసుకొచ్చిన శ్రీ‌మంతుడు చిత్రం 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది.

ఉత్త‌మ గాయ‌ని విభాగంలో బాహుబ‌లిలో గీతాలాప‌న చేసిన ముగ్గురు సింగ‌ర్లు నామినేట్ అయితే.. ఉత్త‌మ గాయ‌కుడు విభాగంలో బాహుబ‌లిలో పాడిన ఇద్ద‌రు గాయ‌కులు నామినేట్ కావ‌టం విశేషంగా చెప్పొచ్చు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా విజేత‌ను ఎంపిక చేసే ఈ అవార్డుల‌కు సంబంధించి ఐఫా వెబ్ సైట్ లో ఈ నెల 28 అర్థ‌రాత్రి వ‌ర‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. జ‌న‌వ‌రి 10న అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జ‌ర‌గ‌నుంది.

ఇక‌.. బాహుబ‌లిని నామినేట్ చేసిన వివిధ విభాగాలు చూస్తే..

1. ఉత్త‌మ చిత్రం : శోభు యార్ల‌గ‌డ్డ / ఆర్కా మీడియా
2. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : ఎస్ ఎస్ రాజ‌మౌళి
3. ఉత్త‌మ న‌టుడు : ప్ర‌భాస్‌
4. ఉత్త‌మ న‌టి : త‌మ‌న్నా
5. ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత : కె శివద‌త్తా
6. ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు : ఎం ఎం కీర‌వాణి
7. ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు : రానా ద‌గ్గుబాటి
8. ఉత్త‌మ స‌హాయ న‌టి : ర‌మ్య‌కృష్ణ‌
9. ఉత్త‌మ స‌హాయ న‌టుడు : స‌త్య‌రాజ్‌
10. ఉత్త‌మ గాయ‌ని : స‌త్య యామిని - గీతామాధురి - దామిని
11. ఉత్త‌ర గాయ‌కుడు : రేవంత్‌.. దీపు

శ్రీ‌మంతుడు చిత్రం:

1. ఉత్త‌మ చిత్రం : వై ర‌వి శంక‌ర్ / జి మ‌హేశ్ బాబు ఎంట‌ర్ టైన్‌మెంట్‌
2. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : కొర‌టాల శివ‌
3. ఉత్త‌మ న‌టుడు : మ‌హేశ్‌బాబు
4. ఉత్త‌మ న‌టి : శృతిహాస‌న్‌
5. ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత : రామ జోగ‌య్య శాస్త్రి
6. ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు : దేవిశ్రీ ప్ర‌సాద్‌
7. ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు : సంప‌త్‌
8. ఉత్త‌మ స‌హాయ న‌టి : తుల‌సి
9. ఉత్త‌మ స‌హాయ న‌టుడు : జ‌గ‌ప‌తిబాబు
10. ఉత్త‌మ గాయ‌ని : స‌త్య యామిని - గీతామాధురి - దామిని
11. ఉత్త‌మ హాస్య న‌టుడు : వెన్నెల కిషోర్‌