Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు బ్లాక్ బస్టర్.. సెల్వందన్ డిజాస్టర్
By: Tupaki Desk | 16 Aug 2015 10:09 AM GMTనెలన్నర కిందటి దాకా కోలీవుడ్ లో తెలుగు సినిమా అంటే ఒక రకమైన చిన్నచూపుండేది. బాహుబలి సినిమాకు ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ ఆ సినిమాను కూడా తేలిగ్గానే తీసుకున్నాడు కోలీవుడ్ జనాలు. కానీ విడుదలయ్యాక ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం చూసి తమిళ ఇండస్ట్రీ వాళ్ల గుండెల్లో గుబులు పుట్టింది. డైరెక్ట్ తమిళ సినిమాల్ని సైతం పక్కకు నెట్టేసి.. బాక్సాఫీస్ ను దున్నేసింది ‘బాహుబలి’. తమిళంలో పాతిక కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది బాహుబలి. ఈ ఊపు చూసి మహేష్ కు కూడా కోలీవుడ్ మార్కెట్ మీద ఆశ పుట్టింది. ‘శ్రీమంతుడు’తో తొలి అడుగు వేద్దామని చూశాడు. బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈగ, బాహుబలి సినిమాల్ని మినహాయిస్తే ఏ తెలుగు సినిమా కూడా కోటి రూపాయలు కూడా పలికింది లేదు. కానీ శ్రీమంతుడు తమిళ వెర్షన్ కు ఏకంగా రూ.3 కోట్ల బిజినెస్ జరిగింది.
తెలుగులో ‘శ్రీమంతుడు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే దిశగా సాగిపోతున్నాడు. సినిమా మీద పెట్టుబడి పెట్టిన వాళ్లందరూ ఖుషీగా ఉన్నారు. తమిళంలో కూడా ‘సెల్వందన్’కు మంచి టాకే రావడంతో అక్కడ కూడా వసూళ్లు బాగానే ఉంటాయని అనుకున్నారు. కానీ టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు లేవు. తొలి వారంలో ఆ సినిమా 1.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. అక్కడ ట్యాక్స్ ఎక్కువ. థియేటర్ రెంట్లు, ఇతర ఖర్చులు పోగా.. డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.45 లక్షలు మాత్రమే వచ్చింది. ఐతే శ్రీమంతుడు వచ్చిన వారానికే తమిళంలో శింబు సినిమా వాలుతో, పాటు ఆర్య-తమన్నా జంటగా నటించిన సినిమా రిలీజయ్యాయి. వాలు సినిమాకు శింబు క్రేజ్ ఉండగా.. ఆర్య సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో సెల్వందన్ వసూళ్లపై బాగా ప్రభావం పడింది. రెండో వారం వసూళ్లు లేవు. ఫుల్ రన్ లో మహా అయితే రూ.75 లక్షల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఐతే పెట్టుబడి ప్రకారం చూస్తే ‘సెల్వందన్’ దారుణంగా నష్టాలు మిగిల్చి.. డిజాస్టర్ అనిపించుకునేలాగే ఉంది.