Begin typing your search above and press return to search.
నైజాంలో శ్రీమంతుడి పని పూర్తయింది
By: Tupaki Desk | 13 Aug 2015 5:45 PM GMTరెండు పెద్ద ఫ్లాపుల తర్వాత ఏ హీరో మార్కెట్ అయినా కొంచెం తగ్గక తప్పదు. ముందు సినిమాకు పెట్టిన స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు ముందుకు రారు. రేటు విషయంలో బేరాలు తప్పవు. కానీ మహేష్ బాబు మార్కెట్ మాత్రం 1 నేనొక్కడినే, ఆగడు లాంటి ఫ్లాపుల తర్వాత కూడా ఏమాత్రం చెక్కుచెదరలేదు. అంత పెద్ద ఫ్లాపుల తర్వాత కూడా మహేష్ మార్కెట్ కొంచెం పెరిగింది తప్ప తగ్గలేదు. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద బిజినెస్ ఏరియా అయిన నైజాంలో అభినాష్ పిక్చర్స్ అనే సంస్థ చాలామందితో పోటీ పడి రూ.14.5 కోట్లకు రైట్స్ తీసుకుంది. మహేష్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ రెండు ఫ్లాపుల తర్వాత తీసిన సినిమా కాబట్టి ఇది సాహసమే అనుకున్నారంతా. బయ్యర్ రిస్క్ చేశాడేమో అని భావించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దిమ్మదిరిగిపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే నైజాంలో 12 కోట్లతో నాన్ బాహుబలి రికార్డును అందుకుంది శ్రీమంతుడు సినిమా. ఆరో రోజుకే 14 కోట్ల మార్కును దాటేసింది. అంటే వారం రోజులకే పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేస్తోందన్నమాట. శ్రీమంతుడు నైజాం ఏరియా గ్రాస్ వసూళ్లు ఇప్పటికే 20 కోట్ల మార్కును అందుకున్నాయి. రెండో వారం నుంచి వచ్చేదంతా లాభమే అన్నమాట. మంగళవారం వరకు జోరుమీదున్న శ్రీమంతుడు బుధ, గురు వారాల్లో కొంచెం జోరు తగ్గించాడు. ఐతే రాబోయేది వీకెండ్.. పైగా స్వాతంత్ర్య దినోత్సవ సెలవు, ఆదివారం కలిసొస్తున్నాయి. కాబట్టి సెకండ్ వీకెండ్ లో శ్రీమంతుడు మళ్లీ జోరందుకోవడం ఖాయం. ఈ శుక్రవారం రెండు సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ ‘శ్రీమంతుడు’కి పెద్దగా ఇబ్బందేమీ ఉండదనే అనుకోవాలి.