Begin typing your search above and press return to search.
సంతృప్తి చెందరా శ్రీమంతుడా..
By: Tupaki Desk | 18 Aug 2015 9:15 AM GMTపది రోజులు తిరక్కుండానే వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేశాడు ‘శ్రీమంతుడు’. బాహుబలి సినిమాను పక్కనబెట్టేస్తే తెలుగు చలనచిత్ర రికార్డులన్నీ చెరిగిపోయాయి. తొలి రోజు, తొలి వారం వసూళ్ల రికార్డులన్నీ తుడిచిపెట్టేశాడు మహేష్. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు వచ్చేశారు. కొన్ని చోట్ల లాభాలు కూడా అందుకుంటున్నారు. యుఎస్ లో అయితే ‘శ్రీమంతుడు’ సందడి మామూలుగా లేదు. మహేష్ కెరీర్ రికార్డుల్ని ఇప్పటిదాకా బాహుబలి మినహా ఏ తెలుగు సినిమా 2 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టిందే లేదు. ఐతే శ్రీమంతుడు ఇప్పటికే 2.7 మిలియన్లు వసూలు చేసి 3 మిలియన్ క్లబ్ దిశగా దూసుకెళ్తోంది.
11 రోజులు ముగిసేసరికి శ్రీమంతుడు గ్రాస్ వసూళ్లు రూ.105 కోట్ల దాకా ఉన్నాయి. షేర్ రూ.70 కోట్లు వచ్చింది. ఏపీ, తెలంగాణ కలిపి 47.5 కోట్ల షేర్ వసూలైంది. ఐతే ఇప్పటిదాకా బాగానే ఉంది. రెండో వీకెండ్ లోనూ ‘శ్రీమంతుడు’ అదరగొట్టాడు. ఐతే ఇక ముందు శ్రీమంతుడు అంత జోరు చూపించే అవకాశాల్లేవు. రాను రాను బండి స్లో అవుతుంది తప్పితే వేగం పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ శుక్రవారం కిక్-2 లాంటి క్రేజీ మూవీ వస్తోంది. ఆటోమేటిగ్గా ఆడియన్స్ అటు షిఫ్ట్ అయిపోతారనడంలో సందేహం లేదు. కాబట్టి మహేష్ అభిమానులు కలలు కన్నట్లు ‘శ్రీమంతుడు’ వంద కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశాలు లేనట్లే. ఒక వేళ ఈ వీకెండ్ కూడా ఖాళీ ఉన్నట్లయితే ఆ రికార్డు శ్రీమంతుడు సొంతమయ్యేదే. కానీ కిక్-2 ఉండటంతో శ్రీమంతుడు కలెక్షన్లకు గండి పడటం ఖాయం. కాబట్టి వంద కోట్ల షేర్ టార్గెట్ ను పక్కనబెట్టేయాల్సిందే. కుదిరితే అత్తారింటికి దారేది పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డును అందుకోవడానికే శ్రీమంతుడు ప్రయత్నించాలి.