Begin typing your search above and press return to search.
రికార్డ్ బ్రేకింగ్ డే వన్.. 30.1 కోట్ల శ్రీమంతుడు
By: Tupaki Desk | 8 Aug 2015 10:20 AM GMTఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ ఒకెత్తు. ఇప్పుడు శ్రీమంతుడు రికార్డులు ఒకెత్తు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో, ఇక ఆడియన్స్ ధియేటర్ల లో మామూలు గోల చేయలేదు. ఏ రేంజు లో గోల చేశారనే విషయం తెలియాలంటే ఈ కలెక్షన్ల ను చూడాల్సిందే.
కేవలం నైజాం లోనే తొలిరోజున 5.6 కోట్లు వసూలు చేసింది శ్రీమంతుడు. ఇకపోతే ఆంధ్ర లో ఏకంగా 7.9 కోట్లు వచ్చింది. మొత్తంగా చూస్తే, ఏపి-నైజాం కలుపుకొని శ్రీమంతుడు సినిమా 13.51 కోట్లు వసూలు చేసింది. ఆ దెబ్బకి తొలిరోజు వసూళ్ళ లో అత్తారింటికి దారేది పేరిట ఉన్న 10.75 కోట్ల ఏపి-నైజాం రికార్డు బ్రేక్ అయిపోనట్లే. నిజానికి ఈ రెండు సినిమాలకూ కలెక్షన్ల లో ఈ లెవెల్లో తేడా రావడానికి పెరిగిన టిక్కెట్ల రేటు కూడా ఒకింత కారణమే. అది పక్కనెట్టేస్తే... డే వన్ సూపర్ హిట్ టాక్ రాకపోతేనే మహేష్ బాబు సినిమాలకు ఓ రేంజులో వసూళ్ళు వస్తాయి. అటువంటిది డే వన్ హిట్ టాక్ వస్తే ఇక సీన్ ఇలాగే ఉంటుంది.
ఇకపోతే అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్కును దాటేసుకొని ఏకంగా శ్రీమంతుడు 8.55 కోట్లు వసూలు చేశాడు. తక్కిన దేశాల్లో కలుపుకుంటే ఇంకో 1.08 కోట్లు వచ్చింది. ఇక కర్ణాటక (2.02 కోట్లు), ఉత్తర భారత్ (0.92), తమిళనాడు (0.56)లను కలుపుకుంటే మొత్తంగా శ్రీమంతుడు సినిమా తొలిరోజున 30.14 షేర్ వసూలు చేసినట్లు. ''బాహుబలి'' సినిమా తరువాత ఇక టాలీవుడ్ లో ఇదే టాప్ షేర్. శ్రీమంతుడు ఈజ్ ది నయా కింగ్.
ఇక్కడ కలెక్షన్లు ఒక్కటే కాదు.. ఫక్తు కమర్షియల్ బాట నుండి మహేష్ ఒక కొత్త 'మెసేజ్' ఒరవడికి శ్రీకారం చూట్టాడని చెప్పొచ్చు. ఫైట్లు, మసాలా పాటలు కూడా లేకుండా మున్ముందు తెలుగు సినిమాలు రికార్డులు కొల్లగొట్టే రోజుల దగ్గర్లోనే ఉన్నాయ్ అంటూ శ్రీమంతుడు హింట్లు ఇచ్చినట్లయ్యింది. వెల్ డన్‌మహేష్, కొరటాల...