Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు దూకుడు.. 42 కోట్ల షేర్
By: Tupaki Desk | 10 Aug 2015 9:29 AM GMTశ్రీమంతుడు కలెక్షన్ల దూకుడు కొనసాగుతోంది. బాహుబలి మినహాయించి ఇప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నిటినీ శ్రీమంతుడు కొట్టేశాడు. మొదటి రోజు రికార్డుల్ని చెరిపేసి, కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అమెరికా సహా విదేశాల్లో ఇప్పటికే 2మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించిందీ చిత్రం. ఇక అన్నిచోట్లా కలుపుకుని బాక్సాఫీస్ షేర్ 42.73 కోట్లు వసూలైంది.
కేవలం ఏపీ, నైజాంలో ఈ తొలివీకెండ్ లో 26.62కోట్లు వసూలైంది. పంపిణీదారులంతా సేఫ్ జోన్ కి వచ్చేసినా, స్కై హై రేట్స్ వల్ల ఎగ్జిబిటర్ల కు బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉందింకా. ఈరోజు రాత్రి వసూళ్లు కలుపుకుని బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. థియేటర్ లో రిలీజ్ కాకముందే శ్రీమంతుడుకి 25కోట్ల లాభాలొచ్చాయి. ఈ సినిమాని 58కోట్లకు విక్రయించారు.. కాబట్టి ఇంత పెద్ద మొత్తం కేవలం మూడురోజుల్లోనే వసూలైపోతోంది. అంటే ఇకనుంచి అంతా లాభాల పంటే. ఇక ఎగ్జిబిటర్ల కు అన్నీ లాభాలే.
ఇప్పటివరకూ ఏరియాల వారీగా సాధించిన షేర్ వివరాలు పరిశీలిస్తే .. నైజాంలో 9.51 కోట్లు, సీడెడ్ లో 4.45కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.17 కోట్లు, గుంటూరు 2.69కోట్లు, తూ.గో 2.61 కోట్లు, ప.గో 2.39కోట్లు, కృష్ణ 1.92కోట్లు, నెల్లూరు రూ.0.89కోట్లు, ఏపీ, నైజాం కలుపుకుని ఇప్పటికి 26.62 కోట్లు వసూలైంది. కర్నాటక లో 4.5కోట్లు, ఇతరచోట్ల నుంచి (నాన్ లోకల్) 1.10 కోటి, విదేశాల నుంచి 10.5 కోట్లు వసూలైంది. మొత్తం షేర్ 42.73కోట్లుగా నమోదైంది. అదీ సంగతి.