Begin typing your search above and press return to search.
60కోట్ల షేర్ తో టాప్ 5లో శ్రీమంతుడు
By: Tupaki Desk | 15 Aug 2015 2:05 PM GMTఒకేసారి మూడు, నాలుగు భాషల్లో తెలుగు సినిమాని రిలీజ్ చేయడం లేటెస్ట్ ట్రెండ్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం ఇలా ఐదు భాషల్లో రిలీజవుతున్నాయి. బాహుబలి ఈ పద్ధతిలోనే రిలీజై రికార్డులు తిరగరాసింది. భారతదేశంలోనే సంచలన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీమంతుడు ఒకేసారి రెండు భాషల్లో రిలీజైంది. కేవలం 8 రోజుల్లోనే ఈ చిత్రం టాలీవుడ్ లో ఉన్న టాప్ -5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
బాహుబలి ఇప్పటికే 275కోట్ల షేర్ వసూలు చేసి, దేశంలోనే నెం.1 గా నిలిచింది. నెల రోజుల తర్వాత కూడా ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలుగు సినిమాల జాబితాని పరిశీలిస్తే మగధీర 83కోట్ల షేర్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. అత్తారింటికి దారేది 74.9కోట్ల షేర్, గబ్బర్‌సింగ్ 60.5కోట్లు షేర్ వసూలు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీమంతుడు 8రోజుల్లో 60కోట్ల షేర్ వసూలు చేసి విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమా ఫుల్ రన్ లో అన్ని రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఫుల్ రన్ లో టాలీవుడ్ నుంచి 100కోట్ల క్లబ్ లో చేరే రెండో సినిమా (బాహుబలి తొలి సినిమా) ఇదే అవుతుందని విశ్లేషిస్తున్నారు.