Begin typing your search above and press return to search.
బొమ్మరిల్లు తర్వాత మళ్లీ ఇప్పుడే..
By: Tupaki Desk | 8 Aug 2015 9:00 AM GMTయాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలు, కామెడీ సినిమాల్లాగే ఒకప్పుడు సెంటిమెంటు సినిమాలని వచ్చేవి. ఐతే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మహిళలు థియేటర్ల కు బాగా వచ్చేవాళ్లు కాబట్టి సెంటిమెంటు సినిమాలు బాగానే ఆడేవి కానీ.. ఆ వర్గం ప్రేక్షకులు టీవీలకు పరిమితమైపోయి థియేటర్లకు రావడం మానేయడంతో ఇప్పుడు ఆ తరహా సినిమాలే రావట్లేదు. ఐతే ఫక్తు సెంటిమెంటు సినిమాలు రాకపోయినా.. ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా తట్టిలేపే సినిమాలు మాత్రం అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఆ తరహా సినిమాలు క్లిక్ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వస్తారు. ఐతే ప్రేక్షకుడిని ఎమోషన్ కు గురి చేయడం అంత వీజీ కాదు. యూత్ ఆడియన్స్ కూడా అప్రయత్నంగా కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి.
అప్పట్లో బొమ్మరిల్లు సినిమా ఇలాంటి ఎమోషన్ కే గురి చేసింది. ప్రి క్లైమాక్స్ లో ‘అంతా మీరే చేశారు’ అంటూ సిద్దార్థ్ తన బాధను వెళ్లగక్కే సన్నివేశంలో చూస్తే అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేస్తాయి. యూత్ ఆడియన్స్ సైతం ఈ సన్నివేశంతో భలే కనెక్టయ్యారు. కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సన్నివేశం అది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడా చూసినా ఒకరకమైన భావోద్వేగం కలుగుతుందా సీన్ చూస్తే. ఐతే బొమ్మరిల్లు తర్వాత ఇంకొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా తట్టిలేపే ప్రయత్నం చేశాయి కానీ.. అవేవీ కూడా అంత ఎమోషన్ కలిగించలేదు. ఐతే ‘శ్రీమంతుడు’ మాత్రం మళ్లీ బొమ్మరిల్లు స్థాయిలో ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. ప్రి క్లైమాక్స్ లో హీరో-తండ్రి మధ్య వచ్చే సన్నివేశం చూస్తే అప్రయత్నంగా కళ్లు వర్షించడం ఖాయం. ఊరిని తన నుంచి తీసేయలేకపోతున్నారని.. తాను మనిషినే ఇక్కడున్నానని, మనసంతా ఊర్లోనే ఉందని చెప్పే సన్నివేశంలో మహేష్ అద్భుతంగా నటించాడు. అక్కడ మహేష్ కాకుండా హర్ష పాత్రే కనిపించింది. జనాలు ఆ క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్టయిపోయి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. హీరో తల్లి కొడుకును చూసి.. ‘‘నా కడుపున పుట్టినందుకు థ్యాంక్స్ రా’’ అంటుంటే ఒక రకమైన ఎమోషన్ కలుగుతుంది ప్రేక్షకుడికి. మొత్తానికి బొమ్మరిల్లు తర్వాత మళ్లీ అంతటి ఎమోషన్ తేగలిగింది శ్రీమంతుడే. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ సినిమా నచ్చుతోంది.