Begin typing your search above and press return to search.
ఆడియో టాక్: శ్రీమంతుడు హిట్టే
By: Tupaki Desk | 22 July 2015 4:08 PM GMTశ్రీమంతుడు ఆడియో ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియో ఇటీవలి కాలంలోనే ది బెస్ట్ అనిపించుకుంది. ఎఫ్‌ఎం, టీవీల్లో తెగ మోగిపోతున్నాయి పాటలు. రిపీట్ రిపీట్ అంటూ మోతెక్కించేస్తూ మీడియా టీఆర్‌పీలు గుంజుకుంటోంది. పదండి ఓ లుక్కేద్దాం.
ఆల్బమ్ లోని మొదటి పాట రామ రామ ఆల్బమ్ కే వెరీ స్పెషల్. ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి ఉపయోగించిన కొన్ని పదాలు మైండ్ కి పట్టేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కథ చెప్పేస్తూ.. ఆదర్శపురుషుడు శ్రీరామునితో మహేష్ క్యారెక్టర్ (హర్ష)ని పోల్చారు. అలాగే విలన్‌ని రావణ అంటూ సంభోదిస్తూ పదాల్ని తెలివిగా ఉపయోగించారు జోగయ్య. ఈ పాటలోనే హీరో, విలన్ పాత్రలు ఏమిటన్నది స్పష్టమైపోతోంది. ఇక జతకలిసే పాటలో శ్రుతితో మహేష్ కెమిస్ట్రీ అదిరిపోయింది. మెలోడి వినసొంపుగా, శ్రావ్యంగా ఉందన్న టాక్ వచ్చింది. చారుసీల క్యాచీ పదాలతో అందరూ పాడుకునేలా ఉంది. 6 వెరైటీ పాటల్లో ఈ పాటకు ఇండివిడ్యువల్ ప్రయారిటీ కనిపించింది. ఇక శ్రీమంతుడు మాంటేజ్ సాంగ్ లో ఎమోషన్ పీక్ లో ఉంది. రోమాలు నిక్కపొడిచే రేంజులో ట్యూన్ అదరగొట్టేశాడు దేవీ.
ఆల్బమ్ లో మరో హిట్ సాంగ్ జాగో జాగో.. సాఫ్ట్ గా, స్మూత్ గా సాగే ఈ పాట గురించి యూత్ లో డిష్కసనే డిష్కసన్. దిమ్మ తిరిగే పాట రాకింగ్ స్టయిల్ లో ఉంది. ఇందులో శ్రుతిహాసన్ అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయనడంలో సందేహమే లేదు. పాటలు హిట్టయ్యాయి కాబట్టి సినిమా కూడా అదే రేంజు లో హిట్టవ్వాలని కోరుకుందాం.