Begin typing your search above and press return to search.
పవన్ ను కొట్టేసిన మహేష్
By: Tupaki Desk | 11 Aug 2015 11:39 AM GMTటాలీవుడ్ వరకు స్టార్ ఇమేజ్ విషయంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తర్వాత ఎవరైనా. వీళ్లిద్దరి సినిమాలు వచ్చాయంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. బాహుబలి లాంటి స్పెషల్ మూవీని పక్కనబెట్టేస్తే కలెక్షన్ల రికార్డుల్లో వీళ్లిద్దరి మధ్యే పోటీ. ప్రస్తుతం నాన్-బాహుబలి రికార్డుల్లో పవన్ కళ్యాణ్ దే హవా అన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం అత్తారింటికి దారేది సినిమా తెలుగు చలన చిత్ర కలెక్షన్ల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ‘శ్రీమంతుడు’తో ఆ రికార్డుల్నే టార్గెట్ చేసుకున్నాడు మహేష్. తొలి రోజు, తొలి వీకెండ్లో మహేష్ జోరు చూస్తే పవన్ రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయమని తేలిపోయింది. తొలి రోజే రూ.23 కోట్ల షేర్ తో, తొలి వీకెండ్లో రూ.42 కోట్ల షేర్‌తో ‘అత్తారింటికి’ రికార్డులను తుడిచిపెట్టేశాడు మహేష్.
ఫుల్ రన్‌లో అన్ని ఏరియాల పవన్ రికార్డుల్ని దాటేయడం ఖాయమని తేలిపోగా.. నైజాం వరకు తొలి నాలుగు రోజుల్లోనే ఆ ఘనత సాధించాడు ‘శ్రీమంతుడు’. సోమవారం కూడా కలుపుకుని ఇప్పటికి ‘శ్రీమంతుడు’ షేర్ రూ.12 కోట్లు దాటేసింది. ‘అత్తారింటికి దారేది’ ఫుల్ రన్ లో ఇక్కడ రూ.11.7 కోట్ల దాకా వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే ఆ రికార్డును దాటేసిన శ్రీమంతుడు ఫుల్ రన్ లో రూ.20 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏరియాకు రైట్స్ కోసం రూ.14.5 కోట్లు పెట్టారు. అప్పుడది చాలా హ్యూజ్ అమౌంట్ అనుకున్నారు కానీ.. ‘శ్రీమంతుడు’ సాధిస్తున్న కలెక్షన్లు చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్ కి భారీ లాభాలు ఖాయమని తెలుస్తోంది.