Begin typing your search above and press return to search.
కేరళలో బాహుబలిని కొట్టేట్టే ఉన్నాడే
By: Tupaki Desk | 12 Aug 2015 5:52 AM GMTమహేష్ మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఇంతకాలం కేవలం తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తే సరిపోతుందని భావించాడు. అందుకే పక్క చూపులు చూడలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మగధీర, ఈగ, బాహుబలి లాంటి సినిమాల ఒరవడి చూశాక అతడికి కూడా పొరుగు భాషలపై కన్ను పడింది. ఇతర మార్కెట్ల పై ఆశపుట్టింది. అందుకే శ్రీమంతుడుతో తొలి అడుగు వేశాడు. ఈ చిత్రాన్ని తమిళ్ లోనూ సెల్వంధన్ పేరుతో రిలీజ్ చేశారు. మహేష్ తమిళ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేశాడు. ఫలితం గుడ్. బాక్సాఫీస్ వద్ద భారీగానే లాభాలార్జించాడు. దీంతో ఇప్పుడు ఇతర భాషలపైనా దండయాత్ర మొదలెట్టాడు.
ఇక మలయాళీల్ని కూడా తనదైన ఛరిష్మాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మలయాళీ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సై అంటున్నాడు. మల్లూ బాబుల్ని మెప్పించడమంటే అంత ఆషామాషీ కాదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మెప్పించలేవు. కాస్త విషయం ఉండాలి. సందేశం ఉండాలి. రియలిస్టిక్ ఎప్రోచ్ తప్పనిసరి. అయితే శ్రీమంతుడులో అవన్నీ ఉన్నాయి. సందేశం, నేచురల్ స్టఫ్ తో పాటు కమర్షియల్ కంటెంట్ అడిషనల్. కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా హిట్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్‌ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అన్ని భాషల్లోనూ దుమ్ము దులిపేసినా మలయాళంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అక్కడినుంచి కేవలం 6 -7 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే శ్రీమంతుడు మాత్రం ఈ బార్డర్ ని క్రాస్ చేస్తాడనే అనుకుంటున్నారు. ఎలాగూ రిలీజ్ కి వెళుతున్నాడు... కాబట్టి వెయిట్ అండ్ సీ.