Begin typing your search above and press return to search.
బాహుబలి స్ఫూర్తితో శ్రీమంతుడు మొదలెట్టేశాడు
By: Tupaki Desk | 3 Aug 2015 6:56 AM GMTఇంతకుముందు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. విడుదలకు రెండు రోజుల ముందే బుకింగ్స్ ఆరంభించేవారు. కొన్ని చిన్నా చితకా థియేటర్ల లో మాత్రం నాలుగైదు రోజుల ముందే బుకింగ్స్ మొదలయ్యేవి. ఐతే బాహుబలి సినిమా దెబ్బకు మొత్తం మారిపోయింది. ఆ సినిమాకు వారం ముందే బుకింగ్స్ మొదలుపెట్టేసి థియేటర్లు నింపేసుకున్నారు. మెజారిటీ థియేటర్లలో వారం ముందే బుకింగ్స్ అయిపోయాయి. బాహుబలి స్ఫూర్తితో ఇప్పుడు ‘శ్రీమంతుడు’ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. విడుదలకు ఐదు రోజుల ముందే చడీ చప్పుడు లేకుండా శ్రీమంతుడు బుకింగ్స్ మొదలైపోయాయి.
ఆదివారం హైదరాబాద్ లోని చాలా థియేటర్లలో శ్రీమంతుడు బుకింగ్స్ మొదలుపెట్టేశారు. ఇలా బుకింగ్స్ మొదలవుతున్నట్లు ఏ సమాచారం కూడా లేదు. అయినప్పటికీ ఒక్క రోజులోనే చాలా వరకు టికెట్లు అయిపోవడం చూస్తే ‘శ్రీమంతుడు’పై జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా నగరాలు, పట్టణాల్లోనూ బుకింగ్స్ మొదలుపెట్టేశారు. కొన్ని థియేటర్ల దగ్గర నేరుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. తొలి రోజే మహేష్ సినిమా చూడాలన్న ఉత్సాహంతో అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతుండటంతో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. విడుదల రోజు తెల్లవారు జామున రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ టికెట్ల అమ్మకాలు రేపట్నుంచి మొదలవుతాయి.