Begin typing your search above and press return to search.
హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రీమంతుడు
By: Tupaki Desk | 6 Aug 2015 3:52 PM GMTఇంతవరకూ టిక్కెట్టు ధరలో టాప్ ప్రైస్ ఏది? భారతదేశ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు ఆవిష్కరించిన బాహుబలి సినిమా చూడడానికి ఓ అభిమాని రూ.10,000 వెచ్చించి ఓ టిక్కెట్ ని కొనుక్కున్నాడు. అంతేనా ఈ సినిమాకి ఏపీ, తెలంగాణలో బెనిఫిట్ షో టిక్కెట్లను రూ.4వేలు నుంచి 8వేలు మధ్య రేటుతో అమ్మకాలు సాగించారు. 10 వేలు ఇప్పటివరకూ టాప్ -1 ప్రైస్ .
ఇప్పుడు ఆ రికార్డును కొట్టేశాడు శ్రీమంతుడు. ఈ సినిమాకి సంబంధించి ఓ టిక్కెట్ ని రూ.15000 వెచ్చించి కొనుక్కున్నాడు ఓ అభిమాని. శ్రీమంతుడు నిర్మాత ఎర్నేని స్నేహితుడు ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి టిక్కెట్ ని కొనుగోలు చేశాడు. అమెరికాలో ప్రీమియర్ షోని వీక్షించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఇప్పటికి టాలీవుడ్ లో ఇదో రికార్డ్ ప్రైస్. శ్రీమంతుడు అమెరికాలో 150థియేటర్ల లో రిలీజవుతోంది.
అంతేకాదు శ్రీమంతుడు మరో ఘనతను సాధించబోతున్నాడు. తొలిసారి ఓ తెలుగు సినిమా తొలి షో ప్రతిష్ఠాత్మక 'ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్' చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతోంది. రేపటి నుంచి ఈనెల 16వరకూ... కాలిఫోర్నియా శాన్ జోస్ లో ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. రేపు సాయంత్రం 8.30కి శ్రీమంతుడు షోని ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకు వేస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు జాకీచాన్, మార్టిన్ షీన్, షరాన్ స్టోన్ వంటి తారలు హాజరవుతుండడం విశేషం.