Begin typing your search above and press return to search.
మహేష్ ఇచ్చిన టార్గెట్ 83 కోట్లు
By: Tupaki Desk | 3 Oct 2015 7:30 AM GMTధనవంతుడు ఊరిని దత్తత తీసుకుని బాగు చేయడం అనే కాన్సెప్టుతో తెరకెక్కి వరల్డ్ వైడ్ డిష్కసన్ పాయింట్ అయ్యింది శ్రీమంతుడు. ఈ సినిమా కాన్సెప్టు పెద్ద రేంజులో సక్సెసైంది. ఈ సినిమా చూశాక.. నిజంగానే ధనవంతులు ఊళ్లను దత్తత తీసుకుని బాగు చేసేపనిలో ఉన్నారు. అంతేకాదు.. శ్రీమంతుడు క్లోజింగ్ బిజినెస్ డీటెయిల్స్ వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తనవంతు షేర్ భారీగానే ఆర్జించింది. ఇటు తెలుగు, అటు తమిళ్ బాక్సాఫీస్ కలుపుకుని ముగింపు నాటికి 83కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇంకాస్త డీటెయిల్స్ లోకి వెళితే...
ఏపీ - తెలంగాణ కలుపుకుని 58.88 కోట్ల షేర్ వసూలైంది. విదేశాల నుంచి 14.10 కోట్లు - కర్నాటక నుంచి 7.2కోట్లు - ఇతర భారతదేశం నుంచి 2.2కోట్లు వసూలు చేసింది. అలాగే ఏపీ - తెలంగాణలో ఏరియాల వైజ్ చూస్తే ... నైజాం 22.10కోట్లు - సీడెడ్ 8.95కోట్లు - నెల్లూరు 2.10కోట్లు - కృష్ణ 4.28కోట్లు - గుంటూరు 5.70కోట్లు - వైజాగ్ 5.6కోట్లు - తూ.గో జిల్లా 5.75కోట్లు - ప.గో జిల్లా 4.4 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో షేర్ 83.13 కోట్లు వసూలైంది.