Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు తెలివైన పనే చేశాడు
By: Tupaki Desk | 7 Aug 2015 10:19 AM GMTనిజానికి ఈ పైరసీ అనేది పెను భూతంలా పట్టిపీడిస్తోంది. అయితే దీనిని అరికట్టడానికి మన కాపీరైట్ చట్టంలో కొన్ని అంశాలున్నాయి. కాని మనం వాటిల్ని ఉపయోగించుకోవడంలో కాస్త స్లో అనే చెప్పాలి. అక్కడికీ బాహుబలి కోసం తెగ ట్రై చేశారు కాని, కోర్టు ఆర్డర్ వచ్చినప్పటికీ దానిని వినియోగించడంలో విఫలమయ్యారు. అందుకే సినిమా రిలీజైన నాలుగు రోజులకే పైరసీ ప్రింట్లు ఇంటర్నెట్ లో చెక్కర్లు కొట్టేశాయి. కాని శ్రీమంతుడు మాత్రం ఆ విషయంలో సరైన పని ఒకటి చేశాడు.
జాన్ డోయ్ ఆర్డర్ అంటూ ఒక యాంటీ పైరసీ కోర్టు ఆర్డర్ ఒకటుంది. ఏ సినిమా కోసం అయినా కోర్టు ద్వారా ఆ ఆర్డర్ ను పొందితే మాత్రం, ఇంటర్నెట్టులో దొంగ వీడియో తీసి అప్ లోడ్ చేసిన వారిపై అలాగే పైరసీ డివిడిలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే కోర్టు నుండి ఈ ఆర్డర్ పొందిన తరువాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఆన్ లైన్ లో ఆ వీడియోను రిమూవ్ చేయాలన్నా, అలాగే సదరు పైరసీకి పాల్పడిన వారిని అరెస్టు చేయాలన్నా కూడా పోలీసుల సహకారం కావాలి.
అందుకే శ్రీమంతుడు నిర్మాతలు చక్కగా హై కోర్టును ఎప్రోచ్ అవ్వగా వారు వెంటనే ఈ ఆర్డర్ అమలుపరచాలంటూ ఆంధ్ర, తెలంగాణ పోలీసులను ఆజ్ఞాపించారు. ఇంకేముంది, ఇప్పుడెవరైనా పైరసీ అంటూ పిచ్చి వేషాలు వేస్తే ఇక ఊసలు లెక్కెట్టాల్సిందే.