Begin typing your search above and press return to search.

శ్రీ‌మంతుడు టాప్ టీఆర్‌ పీ కొట్టేస్తాడా?

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:46 AM GMT
శ్రీ‌మంతుడు టాప్ టీఆర్‌ పీ కొట్టేస్తాడా?
X
బుల్లితెర‌పై బెస్ట్ టీఆర్‌ పీ ఏది? ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ చానెళ్ల‌లో వేస్తున్న సినిమాల్లో ఏ సినిమాకి టాప్ టీఆర్‌ పీ ద‌క్కింది? ఈ డీటెయిల్స్ ఎవ‌రికైనా తెలుసా? ఈ టీఆర్‌ పీ గోల గురించి కామ‌న్ జ‌నాల‌కు అక్క‌ర్లేదు కానీ, పోటీ చానెళ్ల‌కు, మీడియా జ‌నాల‌కు బాగా అవ‌స‌రం. తెలుసుకోవాల్సిన సీన్ ఉందిక్క‌డ‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ బుల్లితెర‌పై టాప్ టీఆర్‌ పీ అక్కినేని హీరో నాగార్జున‌దే. శ్రీ రామదాసు టాప్ టీఆర్‌ పీతో టాప్ 1 పొజిష‌న్‌ లో కొన‌సాగుతోంది. డీటెయిల్స్‌ లోకి వెళితే..

బుల్లితెర‌పై ఎన్నో సినిమాలు రెగ్యుల‌ర్‌ గా వ‌స్తూనే ఉన్నాయి. ఆదివారం నాడు లైవ్ అయ్యే సినిమాకి ఎక్కువ టీఆర్‌ పీలు వ‌స్తుంటాయి. అయితే ఈ రేసులోనే రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర టాప్ టీఆర్‌ పీ అందుకున్న సినిమాగా పాపుల‌ర్ అయ్యింది. మ‌గ‌ధీర 22.70 టీఆర్‌ పీతో కమర్షియల్‌ సినిమాల్లో టాప పొజిష‌న్‌ లో కొన‌సాగింది. అయితే నాగార్జున టైటిల్ పాత్ర పోషించిన శ్రీ‌రామ‌దాసు అంత‌కుమించి రికార్డును అందుకుంది. శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు టెలీకాస్ట్ అయిన శ్రీ‌రామ‌దాసు 24 రేటింగ్ తో ఇప్ప‌టికీ బుల్లితెర‌పై రికార్డుగా న‌మోదై ఉంది. ఈ రికార్డును బాహుబ‌లి కొట్టేస్తుంద‌ని అనుకున్నారు. మొన్న‌టి ద‌స‌రాకి టెలీకాస్ట్ అయిన బాహుబ‌లి కేవ‌లం 21.8 టీఆర్‌ పీతో స‌రిపెట్టుకోవాల్సొచ్చింది. ఈ సినిమా టాప్ 3 పొజిష‌న్‌ కే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. మ‌ధ్య మ‌ధ్య‌లో ఇంట‌ర్వ్యూ లు - న‌స పుట్టించే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బాహుబ‌లి షో జ‌నాల్ని ఘోరంగా హింసించింది. అందుకే ప‌క్క చానెల్‌ లో వేసిన గంగ సినిమా చూడ‌డానికే జ‌నాలు ప్రాధాన్య‌త‌నిచ్చారు.

ఏదైతేనేం బాహుబ‌లి బుల్లితెర రికార్డు అందుకోలేక‌పోవ‌డం వెన‌క స‌వాల‌క్ష కార‌ణాలు. ఇప్పుడు మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ‌మంతుడు బుల్లితెర‌ పైకి వ‌స్తోంది. జీటీవీలో ఈ ఆదివారం ప్రీమియ‌ర్ షో టెలీకాస్ట్ చేస్తున్నారు. మ‌రి శ్రీ‌మంతుడు టాప్ టీఆర్‌ ఫీ కొట్టేస్తాడా? రికార్డులు తిర‌గ‌రాస్తాడా? వెయిట్ అండ్ సీ.