Begin typing your search above and press return to search.

అయ్యో.. యాంకర్ భుజాలు కందిపోయాయ్‌

By:  Tupaki Desk   |   19 July 2016 4:24 AM GMT
అయ్యో.. యాంకర్ భుజాలు కందిపోయాయ్‌
X
యాంకర్ శ్రీముఖి ఈ మధ్య ఓ ఈవెంట్ కి వస్తూ ఎంచక్కా బులుగు రంగు చీర కట్టుకుని.. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని చక్కగా ముస్తాబై వచ్చింది. అయితే.. దానిపై భుజాలను కవర్ చేస్తూ ఓ కోటు లాంటి కాస్ట్యూమ్ వేసుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. సదరు కాస్ట్యూమ్ ను కేప్ అంటారు. అంత చక్కని లుక్ ని.. ఈ కేప్ తో శ్రీముఖి ఎందుకు పాడు చేసిందా అని చాలామంది అనుకున్నారు.

నిజానికి ఆ కేప్ శ్రీముఖి లుక్స్ ని బాగానే చెడగొట్టేసింది. అయితే ఈ విషయం ఆ యాంకర్ కి కూడా బాగానే తెలుసు. అయినా సరే తప్పని సరి పరిస్థితుల్లోనే అలా వేసుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని శ్రీముఖి వివరించింది. కొన్ని రోజుల క్రితం టైట్ ఔట్ ఫిట్స్ వేసుకుని ఓ ప్రోగ్రాం చేసిందీ యాంకర్. పైకి చాలా అందంగా కనిపిస్తున్నా.. అంత టైట్ డ్రస్ ఈమె స్కిన్ ని పాడు చేసేసింది. గోల్డ్ ఎంబ్రాయిడరీతో చూడముచ్చటగా ఉన్న ఆ డ్రస్ కారణంగా.. శ్రీముఖి భుజాలపై మచ్చలు పడిపోయాయి. ఏకంగా ఆ డిజైన్ తరహాలోనే ఆమె భుజాలు కందిపోవడం ఆశ్చర్యమే.

అందంగా ఉన్నా అన్ని రకాల డ్రస్ లు అందరికీ సూట్ కావనే విషయాన్ని ఈ ఉదంతంతో అర్ధం చేసుకోవచ్చు. డ్రస్సుల్లో పరఫెక్టు సైజు మరియు స్కిన్ తత్వానికి పడే మెటీరియల్‌ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. తన భుజాలను కవర్ చేసుకుంటూ కోట్ లాంటిది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో కారణం చెప్పాక.. శ్రీముఖిని గురించి అందరూ అయ్యో అనుకుంటున్నారు.