Begin typing your search above and press return to search.

'డిప్రెషన్'లో సూసైడ్ వరకు ఆలోచించాను: ప్రముఖ యాంకర్

By:  Tupaki Desk   |   29 May 2021 2:30 AM GMT
డిప్రెషన్లో సూసైడ్ వరకు ఆలోచించాను: ప్రముఖ యాంకర్
X
టాలీవుడ్ పాపులర్ టీవీ యాంకర్ శ్రీముఖి ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కరోనా నుండి కోలుకొని సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించింది. తాజా ఇంటరాక్షన్ లో శ్రీముఖి ప్రధానంగా తన డిప్రెషన్ గురించి మాట్లాడింది. ఎప్పుడైనా డిప్రెషన్ కు లోనయ్యరా..? అంటూ నేటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీముఖి.. "అవును. గతంలో ఓసారి డిప్రెషన్ కు గురయ్యాను. కానీ మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అయ్యాను. నేను కూడా డిప్రెషన్ ఫేస్ చేసాను. కానీ త్వరగా దాని నుండి బయటపడటంలో గెలవగలిగాను. డిప్రెషన్ గురించి సరే గాని.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరే మొదటగా ప్రేమించండి" అంటూ హితబోధ చేసింది. శ్రీముఖి అలా చెప్పేసరికి నేటిజన్లు షాక్ అయ్యారు.

ఇదివరకే చెప్పినట్లుగా ప్రస్తుతం శ్రీముఖి ఎవరితో రిలేషన్ షిప్ లో లేనని చెప్పింది. తాజాగా శ్రీముఖి బిగ్ బాస్ రియాలిటీ షోలో లవ్ బ్రేకప్ విషయం బయటపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 3 చివరి వారం టాస్క్ లో భాగంగా.. అప్పుడు ఒకరితో హ్యాపీ రిలేషన్ షిప్ లో ఉన్నానని.. మళ్లీ కెరీర్ కూడా చాలా ఉత్సాహంగా స్టార్ట్ అయిందని చెప్పిందట. ఏదేమైనా చివరికి తేడాలు ఏర్పడ్డాయి. ఆమె ఓ షోలో ప్రదర్శనకు ముందురోజు బ్రేకప్ జరిగినట్లు తెలిపింది. ఆ సమయంలో సూసైడ్ చేసికునే ఆలోచన వచ్చిందని.. కానీ ఎలాగో షూట్ విజయవంతంగా పూర్తి చేసానని చెప్పింది. అయితే శ్రీముఖి తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఓ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పింది కానీ అతని పేరు వివరాలు ఏమి బయటపెట్టలేదు.

అయితే కెరీర్ పరంగా శ్రీముఖి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు.. తనపట్ల పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే కొన్నేళ్లుగా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడున్న ప్రపంచంలో కుటుంబ బాధ్యతలు అనేవి కేవలం మగవారి బాధ్యత మాత్రమే కాదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పరంగా ఇటీవలే ఉగాది జాతిరత్నాలు అనే షోలో కనిపించింది. ప్రస్తుతం బొమ్మఅదిరింది అనే షో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. శ్రీముఖి ప్రస్తుతం పలు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. బిగ్ బాస్ రన్నరప్ అయ్యాక సినిమా ఆఫర్స్ చాలానే వచ్చాయట. కానీ అన్ని స్పైసీ రోల్స్ రావడంతో నో చెప్పిందట. అయితే శ్రీముఖి సినిమాలు షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటోంది. ప్రస్తుతం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ చేస్తోంది.