Begin typing your search above and press return to search.
KGF భామకు అదిరిపోయే ఛాన్స్..!
By: Tupaki Desk | 10 Jan 2023 11:30 PM GMTకె.జి.ఎఫ్ చాప్టర్ 1 అండ్ 2 రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలో నటించిన యశ్ కి నేషనల్ వైడ్ గా సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. కె.జి.ఎఫ్ 2 తర్వాత యశ్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ సినిమాతోనే తెరంగేట్రం చేసిన శ్రీ నిధి శెట్టి మాత్రం కెరీర్ లో దూకుడు చూపించట్లేదు. కె.జి.ఎఫ్ రెండు పార్టుల తర్వాత ఓ రేంజ్ లో దూసుకెళ్తుందని అనుకున్న అమ్మడి కెరీర్ ఎందుకో అనుకున్నంత స్థాయిలో లేదు. విక్రం తో కోబ్రా సినిమా చేసినా అది కూడా వర్క్ అవుట్ అవలేదు.
తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ భారీగా అడిగి షాక్ ఇస్తుందని టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా శ్రీ నిధి శెట్టి మొదటి తెలుగు సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట.
సీనియర్ హీరో కదా సినిమా చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించే టైం ఇది కాదు. ఆల్రెడీ మిగతా హీరోయిన్స్ అంతా కూడా ముందు ఛాన్స్ రావడమే గొప్ప అనుకుంటున్నారు. మంచి ఫాం లో ఉన్నప్పుడు క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం బెటర్. అందుకే వెంకటేష్ తో సినిమా అనగానే మారు మాట మాట్లాడకుండా ఓకే చేసిందట శ్రీనిధి శెట్టి. ఈ
సినిమా క్లిక్ అయితే తెలుగులో కచ్చితంగా అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తాయి. కె.జి.ఎఫ్ లో తన టాలెంట్ తో మెప్పించిన శ్రీనిధి మళ్లీ వెంకటేష్ సినిమాలో తన మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రీనిధి కెరీర్ కు ఇది చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి అమ్మడిని ఒప్పించారో కానీ శ్రీనిధి మాత్రం తెలుగు ఎంట్రీకి మంచి ఛాన్స్ అందుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.