Begin typing your search above and press return to search.

సమంత చిచ్చుబుడ్డి.. రకుల్ తారాజువ్వ..

By:  Tupaki Desk   |   30 Oct 2016 5:10 AM GMT
సమంత చిచ్చుబుడ్డి.. రకుల్ తారాజువ్వ..
X
సినిమాల్లో హీరో కేరక్టర్లు ఎంత ముఖ్యమో.. కామెడీ పాత్రలు కూడా అంతే ముఖ్యం అయిపోయాయి. ఓ సినిమాలో కామెడీ కరెక్టుగా వర్కవుట్ అయిందంటే.. మినిమం గ్యారంటీ అనిపించేసే సిట్యుయేషన్. ఏ జోనర్ లో మూవీ తీసినా నవ్వులు పంచకపోతే మాత్రం అదో లోటు అయిపోతోంది. అందుకే టాలీవుడ్ లో బోలెడంత కమెడియన్స్ ఉన్నారు.. కొత్తగా వచ్చేస్తున్నారు కూడా. అయితే.. ఇప్పుడొచ్చే హాస్య నటుల్లో చాలామందికి.. స్వతహాగానే సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటోంది. అలాంటివారిలో శ్రీనివాసరెడ్డి.. ప్రవీణ్ లను ప్రముఖంగా చెప్పుకోవాలి.

దీపావళి సందర్భంగా ఈ కమెడియన్స్ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇస్తే.. అందులో ఆడపిల్లలను ముఖ్యంగా హీరోయిన్లను టపాసులతో పోలుస్తూ కాసిన్ని పంచ్ లు వేశారు. 'మన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది చూడండి.. ఆ అమ్మయి ఏవన్ టైపు తారాజువ్వ లాంటింది. ఎప్పుడూ జూమ్ అని దూసుకుపోతూనే ఉంటుంది. ఇక సమంత గురించి చెప్పుకోవాలంటే.. మల్టీ కలర్ పూల చిచ్చుబుడ్డే. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా బ్రైట్ గా వెలిగిపోతూనే ఉంటుంది' అని చెప్పాడు శ్రీనివాస రెడ్డి. అ..ఆ..టైములో అనుపమా పరమేశ్వరన్ ను చూసి... కాలు ఎక్కడా నిలవకపోవడంతో.. భూచక్రం అని ఫిక్స్ అయిపోయాడట ప్రవీణ్.

శ్రీనివాసరెడ్డి సెట్స్ లో ఉండడం సమంతకు బాగా నచ్చుతుందట. పెంచుకుంటా వచ్చెయ్ అంటూ శ్రీనివాస రెడ్డితో అంటూ ఉంటుందట సమంత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/