Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: గమ్మత్తైన టైటిల్.. గమ్మత్తైన టాగ్ లైన్!

By:  Tupaki Desk   |   28 Sept 2019 3:41 PM IST
ఫస్ట్ లుక్: గమ్మత్తైన టైటిల్.. గమ్మత్తైన టాగ్ లైన్!
X
కమెడియన్ గా తన సత్తా చాటిన శ్రీనివాసరెడ్డి 'జయమ్ము నిశ్చయమ్మురా' తో హీరోగా కూడా మారాడు. అంతటితో ఆగకుండా దర్శకుడిగా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నాడు. తన స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన సినిమాకు 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే గమ్మత్తైన టైటిల్ ను ఎంచుకోవడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది.

ఈ సినిమాకు 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అనే టాగ్ లైన్ తగిలించారు. ఇది చూడగానే శేఖర్ కమ్ముల సారు 'మంచి కాఫీ లాంటి సినిమా' గుర్తురాక మానదు. శేఖర్ సారుది కాఫీ అయితే శ్రీనివాస్ గారిది రసగుల్లా. ఈ సినిమాలో నో యాక్షన్.. నో సెంటిమెంట్ ఓన్లీ కామెడీ అని ఫిలింమేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి తో పాటు వెన్నెల కిషోర్.. సత్య.. షకలక శంకర్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్య.. శ్రీనివాసరెడ్డి.. శంకర్ ముగ్గురూ కలర్ ఫుల్ కోట్లు ధరించి.. కూలింగ్ గ్లాసెస్ తో యమా స్టైల్ గా కనిపిస్తున్నారు. పైన డాలర్ నోట్లు ఎగరుతూ ఉన్నాయి.

ఈ సినిమాకు భరణి కే దరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సాకేత్ సంగీత దర్శకుడు. కథ.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందించిన వారు పరమ్. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా.. నిర్మాతగా విజయం సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.