Begin typing your search above and press return to search.

శ్రీనివాస్ రెడ్డి పేరుతో మోసం.. ఏం చేశాడంటే.?

By:  Tupaki Desk   |   18 Sep 2018 7:57 AM GMT
శ్రీనివాస్ రెడ్డి పేరుతో మోసం.. ఏం చేశాడంటే.?
X
కమెడియన్ కం హీరో శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేస్తున్నాడని.. దాని వల్ల తనకు చెడ్డ పేరు వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. టాలీవుడ్ లో కోడైరెక్టర్ గా చేస్తున్న రవికిరణ్ అనే వ్యక్తి.. తన పేరిట ఈ నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి మోసం చేస్తున్నాడని విన్నవించారు. ఇండస్ట్రీలోని పరిచయాలను అడ్డం పెట్టుకొని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని.. మంచి కథలు ఉంటే పంపాలని పలువురితో చాట్ చేస్తున్నాడని వివరించాడు.

ఇలా సోషల్ మీడియాలో షేర్లు ఎక్కువవడంతో ఈ విషయం తాజాగా శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఆయన స్పందించాడు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవికిరణ్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. శ్రీనివాస్ రెడ్డి పేరుతోనే కాదు.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లపై నకిలీ ఖాతా సృష్టించి మోసం చేస్తున్నట్టు తేలింది.

ఇటీవల రవికిరణ్ కేరళ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నానంటూ కొంత మంది దగ్గర రూ.5వేల వరకూ డబ్బును తన అకౌంట్ జమ చేయించుకున్నట్టు కూడా పోలీసులు గ్రహించారు. రవికిరణ్ డబ్బు కోసమే ఇదంతా చేశాడని.. అనుమానం రాకుండా శ్రీనివాస్ రెడ్డి పేరును వాడుకున్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపారు.