Begin typing your search above and press return to search.
వైయస్సార్ సినిమా బిజినెస్ సూపరబ్బా!
By: Tupaki Desk | 28 Oct 2016 7:30 PM GMTనటుడు వైయస్సార్ సినిమా బిజినెస్ అదిరిపోయింది. పెద్ద హీరోల సినిమాల్లాగా విడుదల కాక మునుపే టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకొంది. అసలు... వైయస్సారేంటి? నటుడేంటి? ఆ బిజినెస్సేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ వైయస్సార్ అంటే వై.శ్రీనివాసరెడ్డి అని అర్థంలెండి. ఆయనకూడా ట్విట్టర్లో వైయస్సార్ పేరుతోనే చలామణి అవుతుంటాడు. కమెడియన్ గా అందరికీ సుపరిచితుడు శ్రీనివాసరెడ్డి. `గీతాంజలి`తో హీరోగా మారాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో శ్రీనివాసరెడ్డి సుడి తిరిగినట్టయింది. ఆయనకోసం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కథలు సిద్ధమవుతున్నాయి.
`జయమ్ము నిశ్చయమ్మురా` అనే ఓ కొత్త చిత్రంలో నటించాడు. శివరాజ్ కనుమూరి అనే ఓ కొత్త దర్శకుడు తీసిన సినిమా అది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకి చెందిన ఓ ప్రేమజంట నేపథ్యంలో సమైక్యంగా నవ్వుకుందాం అంటూ క్యాప్షన్ పెట్టి తీసిన ఆ సినిమాకి ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టిని ప్రత్యేకంగా చిత్రబృందం త్రివిక్రమ్, సుకుమార్‌లాంటి అగ్ర దర్శకులతో పోస్టర్ ని - టీజర్ ని విడుదల చేయించింది. సుకుమార్ అయితే ఏకంగా ఈ దర్శకుడితో తానొక సినిమా తీస్తానని కూడా ప్రకటించాడు. దీంతో సినిమాలో సమ్ థింగ్ ఉందనే విషయం బయటికొచ్చినట్టైంది. ఇంతలో సినిమా నిజంగానే బాగుందనే టాక్ బయటికి రావడంతో మంచి మార్కెట్టొచ్చింది. థియేట్రికల్ రైట్స్ - శాటిలైట్ రైట్స్‌ని కలిపి 7 కోట్లకి అమ్ముడయ్యాయి. ఎన్ కెఆర్ ఫిల్మ్స్ అధినేత నారా కృష్ణారెడ్డి ఆ సినిమాని కొనుగోలు చేశాడు. శ్రీనివాసరెడ్డి లాంటి ఓ చిన్న హీరో సినిమా ఆ రేంజ్ లో అమ్ముడు పోవడమంటే ఆషామాషీ కాదు. విడుదలకి ముందే నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. బయ్యర్ లాటుగానే సినిమాని 7 కోట్లకి కొన్నాడంటే ఇక ఆయనకి సినిమాపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. విడులదయ్యాక ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/