Begin typing your search above and press return to search.

పెద్ద వ్యాపారం చేస్తున్న చిన్న సినిమా!

By:  Tupaki Desk   |   4 Nov 2016 10:30 PM GMT
పెద్ద వ్యాపారం చేస్తున్న చిన్న సినిమా!
X
క‌మెడియన్ శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా వ‌స్తున్న చిత్రం ‘జ‌య‌మ్మ నిశ్చయ‌మ్మ‌రా’. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రం టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అవుతోంది. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే రీతి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగుతూ ఉండ‌టం విశేషం! ఈ సినిమా టీజ‌ర్ చూడ‌గానే తెగ న‌చ్చేయ‌డంతో హ‌క్కుల్ని రూ. 7 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ట నిర్మాత ఎన్. కృష్ణారెడ్డి. ఇటీవ‌లే విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన ఇంకొక్క‌డు నిర్మాత ఈయ‌న‌. ట్రైల‌ర్ చూడగానే బాగా న‌చ్చ‌డంతోపాటు, సినిమాలో ఎంట‌ర్ టెయిన్మెంట్ కంటెంట్ చాలాబాగుంద‌ని భావించి ఆయ‌న ఈ చిత్రాన్ని భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ప‌రిశ్ర‌మ‌లో ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఆ హాట్ టాపిక్ కు మ‌రింత హీట్ పెంచే ఇంకో విష‌యం ఇప్పుడు తెర‌మీదికి వచ్చింది.

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రానికి ఫ్యాన్సీ ఇచ్చి మ‌రీ నైజాం ప్రాంత హ‌క్కుల్ని కొనుక్కున్నార‌ట ప్ర‌ముఖ నిర్మాత‌ - డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి. ఈ ప్రాజెక్టులోకి తండ్రి సుధాక‌ర్ రెడ్డితోపాటు నితిన్ కూడా చేతులు క‌లిపిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా వైపే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌న్నీ చూస్తున్నాయి. ఇంత‌కీ, ఈ చిన్ని సినిమాలో ఉన్న పెద్ద విష‌యం ఏంట‌నేది చ‌ర్చ‌నీయం అవుతోంది. మొత్తానికి కమెడియ‌న్ క‌మ్ హీరో శ్రీ‌నివాస‌రెడ్డికి ల‌క్కు క‌లిసి క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. నిజానికి, గీతాంజ‌లి సినిమాతోనే హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ, ఆ త‌రువాత‌... కామెడీ పాత్ర‌ల‌ను కూడా వ‌దులుకోలేదు. కాస్త గ్యాప్ త‌రువాత ఇప్పుడు హీరోగా ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. గీతాంజ‌లి సినిమా స‌క్సెస్ త‌రువాత‌, హీరోగా శ్రీ‌నివాస్‌ రెడ్డి చేస్తున్న రెండో ఫిల్మ్ ఇది. ఇప్ప‌టికే ఫుల్ పాజిటివ్ టాక్ తో మాంచి బిజినెస్ చేస్తున్న ఈ చిత్రం... త‌న‌కు హీరోగా మ‌రో హిట్ తెచ్చిపెడుతుంద‌న్న విశ్వాసంతో ఉన్నాడు. ఈ చిత్రంలో శ్రీ‌నివాస‌రెడ్డి స‌ర‌స‌న హీరోయిన్ గా పూర్ణ న‌టిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/