Begin typing your search above and press return to search.

అది మాకు చాలా హెల్ప్ అయ్యింది

By:  Tupaki Desk   |   21 Jun 2018 1:30 AM GMT
అది మాకు చాలా హెల్ప్ అయ్యింది
X
కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన నటులు చాలా మంది ఉన్నారు. కానీ అందరూ అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోవడం లేదు. ఇక శ్రీనివాస్ రెడ్డి మాత్రం అటు కమెడియన్ గా చేస్తూనే హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను హీరో కాదు. కథే హీరో అంటూ తన రేంజ్ ను ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవల హీరోగా చేసిన జంబ లకిడి పంబ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మగాడు ఆడవారిలా నటించడం అనేది. పెద్ద టాస్క్. నా లైఫ్ లో ఈ విధంగా ఎప్పుడు నటించలేదు. సీనియర్ నటులను చూసి కొంత అవగాహన తెచ్చుకున్నా. రాజేంద్రప్రసాద్ - నరేష్ అలాగే చంటబ్బాయ్ లో చిరంజీవి గారు లేడి గెటప్స్ చూసి ఓ స్కెల్ సెట్ సీబీసుకొని ట్రై చేసా. మా అమ్మాయి చూసి మన ఇంట్లో కొత్త అమ్మాయి వచ్చిందని ఆటపట్టించింది.

ఈ సినిమా కథ వినగానే నాని - శర్వానంద్ లాంటి వారికైతే సెట్ అవుతుంది అనిపించింది. అప్పుడు లవ్ స్టొరీ ఎక్కువగా ఉండేది. కానీ నా వరకు వచ్చాక కథలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి జంబలకిడి పంబలో అందరు మారతారు. కానీ ఇందులో కేవలం హీరో హీరోయిన్ లు మాత్రమే చేంజ్ అవుతారు. ఆ టైటిల్ పెట్టడం వల్ల అందరూ కామెడీ సినిమా అనుకుంటున్నారు. అది కూడా మాకు హెల్ప్ అయ్యిందని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.