Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ కోరిక తీరుతుందా?

By:  Tupaki Desk   |   14 Oct 2016 1:30 AM GMT
స్టార్ కమెడియన్ కోరిక తీరుతుందా?
X
కమెడియన్ శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్ మామూలుగా వుండదు. గతంలో అనేక చిత్రాల్లో ఇది రుజువైంది కూడా. తాజాగా నాగచైతన్య ‘ప్రేమమ్’లోనూ అతని కామెడీ టైమింగ్ కి ప్రశంసలొచ్చాయి. ఎంత మంద కమెడియన్లు వచ్చినా... టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేకమైన స్పేస్ ని సంపాదించుకున్నాడు స్టార్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి. గతంలో రైటర్ కోనవెంకట్ నిర్మించిన గీతాంజలిలో హీరోగా నటించాడు. దాని తర్వాత మరో పాత్రతో అలరించేందుకు ఇప్పుడు రెడీ అయ్యాడు.

ఇటీవల విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా.. టీజర్లో విడుదల చేసిన పాటతో మరోసారి తనలోని నటుడ్ని పరిచయం చేసాడు. ‘ఓ రంగుల చిలక చూడే నీయెక’ అంటూ ఒక సిన్సియర్ ప్రేమికుడిగా అడుగులు వేస్తూ.. ఓ భగ్నప్రేమికుడిగా కనిపిస్తున్నాడు. ఈ టీజర్ తోనే సినిమా పై మంచి ఇంప్రెషన్ కలిగిందనడంలో సందేహం లేదు. దేశవాళి వినోదంతో వస్తున్న ఈ ప్రేమకథ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేయడానికి టాప్ ప్రొడ్యూసర్ ముందుకొచ్చినట్టు తెలిసింది.

‘గీతాంజలి’ సినిమాతో హీరోగా మారి తొలి హిట్ అందుకున్నా... చాలా కాలం గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు పూర్ణతో కలిసి జయమ్ము నిశ్చయమ్మురాలో నటిస్తున్నాడు. ఇందులో పాట నచ్చడంతో.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు తెగనచ్చేసి.. టీజర్ ను రిలీజ్ చేశాడు. అంతేకాదు.. శ్రీనివాసరెడ్డిలో కామెడీనే కాదు.. అంతకు మించిన నటుడ్ని చూస్తారని ప్రశంసలు కూడా కురిపించాడు. చూడాలి.. ఈ సినిమాతోనైనా.. కమెడియన్ నుంచి హీరో కావాలనుకునే తన కోరిక నెరవేరుతుందోమో?!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/