Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్.. సుక్కు.. కొరటాల.. ఎందుకొచ్చారంటే..
By: Tupaki Desk | 3 Dec 2016 1:30 AM GMTత్రివిక్రమ్ శ్రీనివాస్.. సుకుమార్.. కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్లో ఈ ముగ్గురికీ చోటుంటుంది. ఈ ముగ్గురూ ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ సినిమా గురించి మంచి మాటలు చెప్పారు. పాజిటివ్ బజ్ మధ్య ఆ చిన్న సినిమా రిలీజవడానికి తోడ్పాటునందించారు. ఆ సినిమానే.. జయమ్ము నిశ్చయమ్మురా. మరి ఈ ముగ్గురూ ఈ సినిమా ప్రమోషన్ కు ఎందుకు ఒప్పుకున్నారో.. వాళ్లను ఎలా మెప్పించామో చెబుతున్నాడు శ్రీనివాసరెడ్డి.
‘‘ముందుగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మోషన్ పోస్టర్ రెడీ చేశాం. ఎవరైనా ప్రముఖ దర్శకుడితో లాంచ్ చేయిస్తే సినిమా గురించి అందరికీ తెలుస్తుందని అనుకున్నాం. త్రివిక్రమ్ గారు గుర్తుకొచ్చారు. నాకున్న పరిచయంతో నేనే ఆయన్ని అడగడానికి వెళ్లాను. మోషన్ పోస్టర్ చూపించాను. చూడగానే.. ఎవరు చేశారయ్యా కొత్తగా ఉందే అన్నారు. చాలా కొత్తగా మాటలు రాసే త్రివిక్రమ్ గారు మా పోస్టర్ చూసి కొత్తగా ఉందనడంతోనే చాలా బలం వచ్చింది. ఈ పోస్టర్ మీరు లాంచ్ చేస్తారా అని అడిగితే.. ఇంకెందుకాలస్యం.. రేపే పెట్టుకో ప్రోగ్రాం అన్నారు. ఆ తర్వాత ఓ రంగుల చిలకా పాట వీడియో పట్టుకుని సుకుమార్ గారి దగ్గరికి వెళ్లాం. ఆయన ఎంత వైవిధ్యంగా సినిమాలు తీస్తారో తెలిసిందే. ఆయన ఆ పాట చూసి కొత్తగా ఉందన్నారు. మొత్తం సినిమా చూస్తానన్నారు. ఆయనకూ చూపించాం. ఆ తర్వాత కొరటాల శివ గారి దగ్గరికి ట్రైలర్ లాంచ్ కోసం వెళ్తే.. ఆయన సినిమా చూపించమన్నాడు. ఆయనతో పాటు వక్కంతం వంశీ.. అనిల్ రావిపూడి కూడా సినిమా చూశారు. వీళ్లందరూ మా సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఆ మాటల వల్ల జనాలకు సినిమా మీద నమ్మకం కలిగింది. ఈ మధ్య దాసరి గారు ఫోన్ చేసి.. ఏమయ్యా మంచి సినిమా తీశారంట. నాకు చూపించరా అన్నారు. ఆయనకు కూడా సినిమా చూపిస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి తెలిపాడు.