Begin typing your search above and press return to search.

ఆ మహేష్ అందరికీ కనపడడులే

By:  Tupaki Desk   |   30 Oct 2016 7:30 AM GMT
ఆ మహేష్ అందరికీ కనపడడులే
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాలంటే.. ఆయన రేంజ్ గురించి చెప్పాలంటే ఎన్ని పేజ్ లైనా చాలవు. కానీ జనాలకు తెలియని ఓ యాంగిల్ ఉంది. జస్ట్ ఓ సినిమాలో మాత్రమే ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రై చేసి వదిలిపెట్టేశాడు మహేష్. ఖలేజాలో చేసిన కంప్లీట్ కామెడీ వర్కవుట్ కాకపోవడంతో.. మళ్లీ సీరియస్ గా ఉండే రోల్స్ నే చేస్తున్నాడు. బయట ఫంక్షన్స్ లో కనిపించినపుడు కూడా మహేష్ బాబు చాలా సీరియస్ గా డిగ్నిఫైడ్ గా కనిపిస్తూ ఉంటాడు. కానీ అసలు సిసలు మహేష్ వేరే ఉంటాడని వినడమే తప్ప ఇప్పటివరకూ చూసే సందర్భం రాలేదు.

'హీరోలందరిలో మహేష్ బాబు బాగా జోక్స్ వేస్తారు. ఆయన కాస్త మంచి మూడ్ లో ఉండాలే కానీ.. అందరినీ కూచోబెట్టుకుని మరీ జోక్స్ వేసి నవ్వుతూ ఉంటారు. అలాంటి మహేష్ బాబును చాలా తక్కువ మందే చూసుంటారు. కానీ ఆయన జోక్స్ వేస్తే మాత్రం అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయ్. ఆయనకు ఉన్నంత కామెడీ సెన్స్.. కామెడీ టైమింగ్ స్టార్ హీరోల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది' అంటున్నాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఉన్న బ్యూటీ సమంత అని చెప్పాడు ఈ కమెడియన్.

కొన్ని నెలల క్రితం బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ టైమ్ లో సమంత కూడా మహేష్ కామెడీ గురించి చెప్పింది. మహేష్ గానీ జోక్ వేశాడంటే.. ఇక మనం అక్కడ నిలబడ్డం కూడా కష్టం అంటూ తెగ హంగామా చేసింది సమంత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/