Begin typing your search above and press return to search.

త్రిష కంటే.. త్రిష టాటూ ఇష్టం

By:  Tupaki Desk   |   20 April 2016 4:05 PM GMT
త్రిష కంటే.. త్రిష టాటూ ఇష్టం
X

నాయకి మూవీ త్రిష కెరీర్ లోనే స్పెషల్ గా మిగిలిపోయేలా ఉంది. ఫస్ట్ టైం తనే లీడ్ రోల్ లో నటిస్తోంది. టైటిల్ కేరక్టర్ లో చేయడం కొత్త కాకపోయినా.. సినిమా మొత్తాన్ని తనే లీడ్ చేయాల్సి ఉండడం మాత్రం ఈ చెన్నై బ్యూటీకి ఇదే మొదటిసారి. అయితే.. త్రిషకు ఎంత పేరుందో ఆమె టాటూలకు అంతే క్రేజ్ ఉందనే మాట ఒప్పుకోవాల్సిందే.

నాయకిలో త్రిష చాలా కొత్తగా కనిపిస్తోంది. ట్రైలర్ లో స్టయిలిష్‌ లుక్‌ లో దర్శనమిచ్చింది. అయితే.. ఈ ఆడియో ఫంక్షన్ లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చాక.. ఆ మూవీ హీరోయిన్ ని పొగడ్డం కొత్త కాదు కానీ.. త్రిష కంటే టాటూనే ఎక్కువగా పొగడ్డం ఆశ్చర్యం కలిగించే విషయమే.

త్రిష తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి.. త్రిష కంటే ఆమె టాటూ అంటేనే ఎక్కువ ఇష్టం అనేశాడు. ఇతగాడి మాటలకు త్రిష మురిసిపోయింది చూడండి. అసలు తనకు సమానంగా తన ట్యాటూలకు క్రేజ్ రావడం.. అమ్మడికి భలే ఆనందాన్ని ఇచ్చినట్లుగా ఉంది. మొత్తానికి నాయకి సినిమాలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా గతంలో లేనంత హ్యాపీగా కనిపించింది త్రిష.