Begin typing your search above and press return to search.

కమెడియన్ కి బన్నీ ఆ బిరుదిచ్చాడట!

By:  Tupaki Desk   |   3 Dec 2019 2:32 PM IST
కమెడియన్ కి బన్నీ ఆ బిరుదిచ్చాడట!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కామెడీ హీరోల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకడు. ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తుంటాడు రెడ్డి. లేటెస్ట్ గా స్వీయ దర్శకత్వంలో 'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' అనే సినిమా చేసి రిలీజ్ కి రెడీ చేసాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన శ్రీనివాస్ రెడ్డి తనకు ఎక్కువగా హారర్ కథలే వస్తుంటాయని అన్నాడు. 'గీతాంజలి' - 'ఆనందో బ్రహ్మ' తర్వాత బన్నీ తనకు హారర్ స్టార్ అనే బిరుదు ఇచ్చాడని, ఇక నుండి నువ్వు హారర్ స్టార్ అని చెప్పాడని తెలిపాడు రెడ్డి.

అయితే దెయ్యాల వల్ల భయపడే స్టేజి నుండి దెయ్యాలనే భయపెట్టే స్టేజి వరకూ హారర్ సినిమాలు వచ్చేసాయని అందుకే ఆ జోనర్ లో ఏదైనా కొత్త కథ వస్తే తప్ప సినిమా చేయనని అన్నాడు. సో రెండు హారర్ సినిమాలతోనే బన్నీ చేత హారర్ స్టార్ అనిపించుకున్నాడన్నమాట శ్రీనివాస్ రెడ్డి.