Begin typing your search above and press return to search.
కమెడియన్ డైరెక్షన్ లో రవితేజ?
By: Tupaki Desk | 24 Oct 2017 11:20 AM GMTరాజా ది గ్రేట్ సినిమాతో మళ్లీ మాస్ మహారాజ కెరీర్ సెట్ అయ్యిందనే చెప్పాలి. దాదాపు రెండేళ్ల నిరీక్షణకు మంచి కథ దొరకడంతో మాస్ మహా రాజా మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ కథలను కూడా రవి తేజ కొత్తగా ఉంటేనే సెలెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. రాజా ది గ్రేట్ తర్వాత ఆఫర్స్ బాగానే వస్తున్నా ఇంకా రవి దేన్నీ ఫైనల్ చేయలేదు.
అయితే రవితేజ ఎక్కువగా కొత్త దర్శకులతోనే హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా శ్రీను వైట్ల - హరీష్ శంకర్ లకి రవితేజ లైఫ్ ఇచ్చాడు. అలాగే గోపీచంద్ మలినేని రైటర్ కె.ఎస్ రవీంద్ర (బాబి) కూడా రవితేజ సినిమాల ద్వారా వచ్చినవారే. ఇక టచ్ చేసి చూడు సినిమాతో మరో స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ సిరి ని కూడా రవి తేజ దర్శకుడిగా పరిచయం చేయిస్తున్నాడు. అయితే ఈ సారి మారో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడట ఈ కిక్ హీరో. అతను ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ నటుడు ఇప్పుడు దర్శకుడిగా కూడా అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు.
రాజా ది గ్రేట్ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి - రవి తేజ కాంబినేషన్ చాలా వరకు మంచి హిట్ అయ్యింది. అయితే రాజా ది గ్రేట్ షూటింగ్ సమయంలో శ్రీనివాస్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా వర్క్ చేశాడట. ఇటీవల రవితేజకు ఒక కథను కూడా చెప్పాడట. కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.