Begin typing your search above and press return to search.
పెళ్లి అవసరం లేదంటున్న అవసరాల శ్రీనివాస్.. కారణం..?
By: Tupaki Desk | 4 Feb 2022 2:30 AM GMTఅవసరాల శ్రీనివాస్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశారు. అయితే నటనపై ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన ఈయన.. 2008 లో విడుదలైన `అష్టా చమ్మా` సినిమాతో నటుడిగా తొలిసారి ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా రాణించిన అవసరాల శ్రీనివాస్.. `ఊహలు గుసగుసలాడే`, `జ్యో అచ్యుతానంద` సినిమాలతో దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈయన వయసు 40కి చేరువవుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో `పెళ్లెప్పుడు..?` అని ప్రశ్నించగా.. అందుకు శ్రీనివాస్ `డబ్బుల్లేవ్ అందుకే వాయిదా వేస్తున్నా..`అంటూ సమాధానం ఇచ్చాడు.
కానీ, ఇప్పుడు మాత్రం తనకు పెళ్లి అవసరం లేదని, అసలు పెళ్లి చేసుకోనని చెప్పేస్తున్నాడు. తాజాగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నా, దాని వెనక పెద్దగా కారణాలు ఏమీ లేవని పేర్కొన్నాడు. అలాగే పెళ్లి చేసుకోనన్న విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు.. మా నాన్న గారు తన నిర్ణయం పట్ల జలస్ ఫీల్ అయ్యారని, ఎందుకుంటే తన ట్రాక్ ఆయనకు బాగా నచ్చిందని కూడా శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
దీంతో ఇప్పుడు శ్రీనివాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. అవసరాల శ్రీనివాస్ చివరిగా `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. శ్రీనివాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.