Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడిని చంపితే లక్ష బహుమతి

By:  Tupaki Desk   |   8 April 2017 10:26 AM GMT
ఆ దర్శకుడిని చంపితే లక్ష బహుమతి
X
గత కొద్ది రోజులుగా దుమారం రేపుతున్న షార్ట్ ఫిలిం ‘సీత.. ఐయామ్ నాట్ ఏ వర్జిన్’’ దర్శకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆయన్ను హతమార్చితే లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ ఓ లాయర్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ కు చెందిన హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి, లాయర్‌ శ్రీనివాస యాదవ్‌ ఓ ప్రకటన చేస్తూ ‘సీతా… అయాం నాట్‌ ఏ వర్జిన్‌’ దర్శకుడిని వీపు పగలగొట్టినవారికి రూ. 50,000, అతన్ని దేవుని దగ్గరకు పంపినవారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని అనౌన్సు చేశారు.

‘సీతా… అయాం నాట్‌ ఏ వర్జిన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ను మార్చి 12న దర్శకుడు కౌశిక్‌ బాబు - నిర్మాత నిర్జానాయుడు యూట్యూబ్‌ లో అప్‌ లోడ్‌ చేశారు. అప్‌ లోడ్‌ అయిన తరువాత రోజే కొందరు బిజేపీ నాయకులు ఈ చిత్రం సీత పేరును అప్రతిష్ట పాలు చేసేవిధంగా ఉందని, హిందూవుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడుతూ ఆ చిత్ర యూనిట్‌పై పోలీస్‌ కేసు పెట్టారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే ఇప్పుడు ఇలాంటి ప్రకటన చేశారు.

కాగా చిత్ర దర్శకుడు కౌశిక్ బాబు మాత్రం ఈ సినిమాను ఉమన్ ఎంపవర్ మెంట్ కోసం తీశానే కానీ ఎవరినీ కించపరిచేందుకు కాదని చెబుతున్నారు. కౌశిక్ బాబు గతంలో పలు ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సినిమాకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/