Begin typing your search above and press return to search.
నితిన్ సినిమాకు భలే డీల్
By: Tupaki Desk | 24 July 2018 8:33 AM GMTఎలాంటి సినిమా తీశాం అన్నదానికంటే.. దానికి ఎంత బాగా ప్రోమోలు కట్ చేశాం అన్నది కీలకంగా మారిపోయింది ఈ రోజుల్లో. చిన్న పెద్ద అని తేడా లేదు.. ఏ సినిమాకైనా ప్రోమోలు బాగుంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తుంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ‘ఆర్ఎక్స్ 100’ అనే చిన్న సినిమాకు అంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే.. ప్రోమోలు జనాల్ని ఆకర్షించడమే కారణం. దిల్ రాజు బేనర్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ కూడా చక్కటి ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నీ కూడా ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజైన టీజర్ కూడా చాలా ఆహ్లాదంగా.. అందంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆడియో కూడా ఆకట్టుకుంది. టీజర్ రావడం ఆలస్యం ఆ చిత్రానికి ఓవర్సీస్ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.
‘శ్రీనివాస కళ్యాణం’ ఓవర్సీస్ హక్కుల్ని ఓ సంస్థ రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నితిన్ కెరీర్లో ‘అఆ’ తర్వాత అత్యధిక రేటు పలికిన సినిమా ఇదే. అతడి గత రెండు సినిమాలు సరిగా ఆకట్టుకోనప్పటికీ ‘శ్రీనివాస కళ్యాణం’ ఈ రేటు దక్కించుకోవడం విశేషమే. ఇందుకు ఈ చిత్ర ప్రోమోలే కారణమయ్యాయి. అక్కడ పెట్టుబడిని వెనక్కి తేవాలంటే ‘శ్రీనివాస కళ్యాణం’ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరాల్సిందే. ఐతే యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుండటంతో.. దీనికి పాజిటివ్ టాక్ వస్తే మిలియన్ డాలర్ల వసూళ్లు పెద్ద కష్టం కాకపోవచ్చు. దీనికి భారీగా ప్రిమియర్లు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘శ్రీనివాస కళ్యాణం’ మంచి బిజినెస్సే చేస్తున్నట్లు సమాచారం. ‘శతమానం భవతి’ తర్వాత సతీశ్ వేగేశ్న రూపొందించిన ఈ చిత్రం దాని తరహాలోనే మంచి విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి.