Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: కళ్యాణ సమయాన కమనీయ ప్రేమ!

By:  Tupaki Desk   |   22 July 2018 12:11 PM GMT
టీజర్ టాక్: కళ్యాణ సమయాన కమనీయ ప్రేమ!
X
దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చే సినిమాలకు సహజంగానే హైప్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాకనుక ప్లాన్ చేస్తే ఆ సినిమాకు ముందునుండే పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు అదేరకమైన పాజిటివ్ బజ్ దిల్ రాజు బ్యానర్ నుండి రానున్న తాజా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' పై కూడా ఉంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈమధ్యనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ప్రోమోలు చూసిన వారు టీజర్ ను కూడా అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కు తగ్గట్టే ఉంటుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ యూత్ ఫుల్ టీజర్ తో సర్ప్రైజ్ చేసింది 'శ్రీనివాస కళ్యాణం' టీమ్. కనులకింపైన విజువల్స్.. నితిన్-రాశి మధ్య కెమిస్ట్రీ.. ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతం... తొలిప్రేమ టచ్ లో తీయడం తో ఈ సినిమాలో కుర్రాళ్ళకు నచ్చే ఎలిమెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయని టీమ్ పరోక్షంగా హింట్స్ ఇచ్చింది. 'ఈవెనింగ్ నాకు 2 అవర్స్ మీ టైమ్ అప్పు కావాలి'..అంటూ నితిన్ చెప్పిన చిలిపి డైలాగ్.. 'ఈ టైమ్ అప్పేంటి' అని సర్ ప్రైజింగ్ గా అడిగిన రాశి క్యూట్ ఎక్స్ ప్రెషన్ మాత్రం హైలైట్.

వీటన్నిటితో పాటు నితిన్ బుగ్గపై ఘాటుగా ముద్దుపెట్టిన షాట్ కూడా ఖచ్చితంగా కుర్రాళ్ళకు కిక్కించేదే. చూస్తుంటే దిల్ రాజు టీమ్ కుర్రాళ్ళకు గట్టిగానే గాలం వేయడానికి టీజర్ ని కట్ చేయించాడేమో అనిపిస్తోంది.. ఇంకెందుకాలస్యం 38 సెకండ్ల టైమ్ దిల్ రాజు గారికి.. నితిన్- రాశిలకు.. సతీష్ వేగేశ్నకు అప్పిచ్చి మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.