Begin typing your search above and press return to search.

80% ఇండియ‌న్ క్రూతోనే

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:52 AM GMT
80% ఇండియ‌న్ క్రూతోనే
X
వేలాది మంది ట‌న్నుల కొద్దీ శ్ర‌మిస్తే సాధ్య‌మైన సినిమా `2.ఓ` అని శంక‌ర్ వేదిక‌ల‌పై చెప్పిన సంగ‌తి తెలిసిందే. 2డి కెమెరాల‌తో వ‌ద్ద‌నుకుని - నేరుగా 3డి కెమెరాల్ని ఉప‌యోగించి చిత్రీక‌రించిన ఫుటేజ్‌ని వీఎఫ్ ఎక్స్ టీమ్‌ తో అభివృద్ధి చేశామ‌ని - అందుకోసం ఓ కంపెనీని న‌మ్మితే ఆ ప‌నిని చేయ‌డంలో త‌డ‌బ‌డ‌డ‌మే గాక చివ‌రి నిమిషంలో పెద్ద బాంబ్ పేల్చింద‌ని శంక‌ర్ చెప్పారు. మ‌రో 6 నెలల నుంచి ఏడాది స‌మ‌యం కావాలని దుబాయ్ ఈవెంట్ వేళ వీఎఫ్ ఎక్స్ కంపెనీ చెప్ప‌డంతో నిర్ఘాంత‌పోయామ‌ని చెప్పారాయ‌న‌. అందుకే వీళ్ల ద‌గ్గ‌ర ఉన్న విజువ‌ల్స్ - పూర్త‌యిన ప‌నిని మొత్తం గుంజుకుని వేరొక పెద్ద కంపెనీకి న‌మ్మ‌క‌మైన వాళ్ల‌కు ఇచ్చామ‌ని - అందువ‌ల్ల సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంద‌ని కఠోరమైన స‌త్యాన్ని శంక‌ర్ ఆవిష్క‌రించారు.

అయితే దీనిపై వీఎఫ్ ఎక్స్ సూప‌ర్‌ వైజ‌ర్ టీమ్ హెడ్ శ్రీ‌నివాస్ మోహ‌న్ మాట్లాడుతూ -``ప్రారంభం 2.ఓకి వీఎఫ్ ఎక్స్ చేసిన కంపెనీ దెబ్బ కొట్ట‌డం ఇబ్బంది పెట్టింది. అయితే 80 శాతం మంది ఇండియ‌న్ టెక్నీషియ‌న్స్ క్రూతోనే ప‌ని చేశాను. వీళ్లంద‌రి స‌పోర్టుతోనే నాకు అప్ప‌జెప్పిన‌ ప‌నిని స‌వ్యంగా పూర్తి చేయ‌గ‌లిగాను. వీళ్ల అండ‌దండ‌లు లేక‌పోతే నేను ఈ ప‌నిని స‌మ‌ర్ధంగా పూర్తి చేయ‌గ‌లిగేవాడినో లేదో నాకు తెలీదు. కొన్ని త‌ప్పిదాల త‌ర్వాత‌ వీఎఫ్ ఎక్స్ ప‌ని మొత్తం చ‌క్క‌ని ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఉన్న టీమ్‌ తో క‌లిసి చేయించాం. వాళ్లు 3డి సినిమాల‌కు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు`` అని తెలిపారు.

ముఖ్యంగా 2.ఓ సినిమాలో క్రోమ్యాన్ పాత్ర రూపం.. ప‌క్షి గెట‌ప్ కోసం ఎంత‌గానో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని - దీనికోసం ఏకంగా ఏడాదిన్న‌ర పాటు శ్ర‌మించామని శ్రీ‌నివాసన్ తెలిపారు. వేరొక‌ ఆప్ష‌న్ లేని టైమ్‌ లోనే దీనికోసం లెగ‌సీ ఎఫెక్ట్స్ స్టూడియో-లాస్ ఏంజెల్స్ వాళ్ల‌ను క‌లిసి ఈ ప‌క్షి లుక్‌ ని ఫైన‌ల్‌ గా డిజైన్ చేశాం. ముందుగా 3డి మోడ‌లింగ్ లో ప‌క్షి రూపాన్ని డిజైన్ చేసి ఓకే చేశామ‌ని తెలిపారు. ``ప‌క్షి గెట‌ప్ డిజైన్‌ కోసం నెల‌రోజుల స‌మ‌యం ప‌ట్టింది. 2.ఓ మొత్తానికి వీఎఫ్ ఎక్స్ కే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింది. కానీ అంతిమంగా వ‌చ్చిన విజువ‌ల్స్‌ తో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇది రోబో కంటే వంద రెట్లు బెట‌ర్‌ గా ఉంటుంది`` అని శ్రీ‌నివాసన్ అన్నారు.