Begin typing your search above and press return to search.
వామ్మో.. జక్కన్న వార్నింగ్ నేనేం చెప్పను
By: Tupaki Desk | 13 Dec 2018 5:43 AM GMTఈమద్య కాలంలో వచ్చిన ‘రోబో’ - ‘బాహుబలి’ - ‘2.ఓ’ చిత్రాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ సౌత్ సినిమాల స్థాయిని అమాంతం పెంచేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకులు శంకర్ మరియు రాజమౌళి ఊహించినదాన్ని అంతే అద్బుతంగా వెండి తెరపై చూపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్. భారీ చిత్రా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పని చేసిన ఈయన ప్రస్తుతం జక్కన్న తో మరో సినిమాకు వర్క్ చేస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ పెద్దగా గ్రాఫిక్స్ ప్రధానం కాదనే విషయం మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. కాని ఈమద్య కాలంలో చిన్నా చితకా సినిమాల్లో కూడా ఏదో ఒక రకంగా విజువల్ ఎఫెక్ట్స్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఇరత సీన్స్ విషయంతో పోల్చితే అవి హైలైట్ కావు. ఆర్ మల్టీస్టారర్ లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట కాని హైలైట్ అయ్యేంతగా మాత్రం ఉండవట. ఈ విషయాన్ని తాజాగా శ్రీనివాస్ మోహన్ చెప్పుకొచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో ఈయన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 కు వర్క్ చేయలేక పోవడానికి కారణం - 2.ఓ చిత్రం కోసం పడ్డ కష్టం - బాహుబలి సమయంలో జక్కన్నతో అనుబంధం ఇలా అన్ని విషయాల గురించి చాలా మాట్లాడిన శ్రీనివాస్ మోహన్ ఒక్క విషయం వద్దకు వచ్చేసరికి నోటికి తాళం వేసుకున్నట్లుగా సైలెంట్ అయ్యాడు. అదే ఆర్ మల్టీస్టారర్ మూవీ. అవును.. జక్కన్న మల్టీస్టారర్ విశేషాలు చెప్పాల్సిందిగా కోరిన సమయంలో వామ్మో ఆ సినిమా గురించి మాత్రం నన్నేం అడగవద్దు ప్లీజ్.. ఆ సినిమా గురించి ఏ విషయం అయినా రాజమౌళి నోటి నుండే రావాలి - అది జక్కన్న సీరియస్ వార్నింగ్ అంటూ శ్రీనివాసన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి జక్కన్న యూనిట్ సభ్యులందరిని మంచి కంట్రోల్ లో పెట్టి సినిమా విషయాలు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.