Begin typing your search above and press return to search.

తండ్రిని డైరెక్ట్ చేసిన‌ ఆనందం ఇంత‌లోనే..

By:  Tupaki Desk   |   4 Dec 2019 11:34 AM GMT
తండ్రిని డైరెక్ట్ చేసిన‌ ఆనందం ఇంత‌లోనే..
X
క‌మెడియ‌న్ గా మొద‌లై హీరోగా న‌టించినా ఎంతో ఒద్దిక‌గా ఉండి అంద‌రి మెప్పు పొందిన న‌టుడు శ్రీ‌నివాస రెడ్డి. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌నిర్మాత‌గానూ ల‌క్ చెక్ చేసుకుంటున్నాడు. ఇంత‌కుముందు గీన‌తాంజ‌లి- జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా- ఆనందో బ్ర‌హ్మ వంటి చిత్రాల‌తో లీడ్ పాత్ర‌ధారిగా న‌టించి కాన్ఫిడెన్స్ పెంచుకున్న శ్రీ‌నివాస రెడ్డి ఈసారి ద‌ర్శ‌కుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్న‌మే ఇది. నిర్మాత‌గానూ తొలి అనుభ‌వం. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అనుకోకుండానే ద‌ర్శ‌కుడయ్యాన‌ని ఆయ‌న తెలిపారు.

డిసెంబ‌ర్ 6న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు. శ్రీ‌నివాస రెడ్డి మాట్లాడుతూ..``చాలా ప‌రిమిత బ‌డ్జెట్‌లో పూర్తి వినోదాత్మ‌క చిత్రాన్ని చేయాల‌ని అనుకుంటున్నా. ఆ క్ర‌మంలోనే `జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం చెప్పిన పాయింట్ మీద క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. క‌థ చాలా బాగా వ‌చ్చింది. దాంతో సినిమా మా క‌మెడియ‌న్స్ గ్రూప్ ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ బ్యాన‌ర్ లోనే సినిమా చేయాల‌ని అనుకున్నా. చాలా మంది క‌మెడియ‌న్స్ వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. నేను ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే త‌మ నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి పారితోషికం ఇవ్వ‌లేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్ల రిలీజ్ త‌ర్వాతే డ‌బ్బులు తీసుకుంటామ‌ని అంద‌రూ అన్నారు. అలా నేను `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు` సినిమాకు డైరెక్ట‌రయ్యాను`` అని తెలిపారు.

అనీల్ రావిపూడి ప్రోత్సాహం.. దిల్ రాజు గారి స‌ల‌హాలు .. ట్రైల‌ర్ క‌ట్ చేసిన అనుభ‌వం ఇవ‌న్నీ క‌లిసొచ్చాయి. ఈ సినిమా క‌థ విన్న రావిపూడి జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని సూచించారు అని తెలిపారు. వీటితో పాటు మ‌రో ఎమోష‌న‌ల్ ఇన్సిడెంట్ ని ఎంతో ఎమోట్ అవుతూ తెలిపారు శ్రీ‌నివాస రెడ్డి. ఈ చిత్రంలో త‌న తండ్రి గారు ఓ పాత్ర‌లో న‌టించార‌ని ఆయ‌న‌పైనే తొలి షాట్ తెర‌కెక్కించాన‌ని తెలిపారు. అయితే ఈ సినిమా రిలీజ‌య్యే లోగానే ఆయ‌న మ‌ర‌ణించడం ఆవేద‌న క‌లిగించింద‌ని వెల్ల‌డించారు.