Begin typing your search above and press return to search.
జంబలకిడిపంబ-మ్యాజిక్ మళ్ళీ చేస్తారా
By: Tupaki Desk | 29 Dec 2017 9:50 AM GMT1993లో వచ్చిన ఈ సినిమా చూసి నవ్వని ప్రేక్షకుడు లేడు. లింగ మార్పిడి కాన్సెప్ట్ కి కామెడీ జతచేసి దివంగత ఈవివి సత్యనారాయణ గారు వండిన ఈ నవ్వుల వంటకం వంద రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వులు పంచుతూనే ఉంది. ఇప్పటికీ టీవీలో కామెడీ బిట్స్ రూపంలో ఈ మూవీ క్లిప్పింగ్స్ వచ్చినప్పుడు ఛానల్ మార్చబుద్ది కాదు. అదే జంబలకిడిపంబ. ఇన్నాళ్ల తర్వాత అదే పేరుతో శ్రీనివాసరెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. జెబి మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇవాళ్టి నుంచి స్టార్ట్ చేసారు. పోసాని కీలక పాత్రలో నటించే కొత్త జంబలకిడిపంబలో వెన్నెల కిషోర్ - సత్యం రాజేష్ - ధన్ రాజ్ - షకలక శంకర్ - హరితేజ - కేదార్ శంకర్ - మధుమణి - సన - గుండు సుదర్శన్ సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తారు.
90 దశకంలో వచ్చిన జంబలకిడిపంబకు ఏ మాత్రం తీసిపోని రీతిలో దీన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు అంటున్నారు. ఊపిరి, నిన్ను కోరి సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా సూపరిచితుడు అయిన గోపి సుందర్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. టూ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీనివాసరెడ్డి కనిపిస్తాడట. తను సోలో హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమురా ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికి ఆనందో బ్రహ్మ సక్సెస్ కావడం శ్రీనివాసరెడ్డికి జోష్ ఇచ్చింది. ఇది కూడా మేజర్ బ్రేక్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీ మే లేదా జూన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రవి - జోజో జోస్ - ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరి ఆనాటి జంబలకిడిపంబ పేరుతో వస్తున్న ఈ మూవీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.