Begin typing your search above and press return to search.
మళ్ళి పెళ్లి ఏంటండి?
By: Tupaki Desk | 6 Jan 2018 10:20 AM GMTపై ఫోటో చూస్తే కమెడియన్ కం హీరో శ్రీనివాసరెడ్డిని ఎవరికైనా ఈ ప్రశ్నే అడగాలి అనిపించడం సహజం. ఎందుకంటే ఈ ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి మళ్ళి పెళ్లి అని హెడ్డింగ్ పెట్టుకుంది ఆయనే కాబట్టి. అదేంటి ఈ మధ్యే రెండో బిడ్డకు తండ్రైన శ్రీనివాసరెడ్డి మరోసారి పెళ్లి చేసుకోవడం ఏంటి అనే కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తూ అసలు విషయం తనే చెప్పాడు. ఇది నిజం పెళ్లి కాదట. మను దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి హీరోగా రూపొందుతున్న జంబలకిడిపంబ సినిమా షూటింగ్ కోసం. పాతికేళ్ళ క్రితం ఈవివి సత్యనారాయణ తీసిన ఆల్ టైం కామెడీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన జంబలకిడిపంబ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కీలక మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో సీనియర్ నరేష్ హీరోగా నటించగా ఆమని హీరొయిన్ గా చేసింది. ప్రేక్షకులు ఈ మూవీ చూస్తున్నంత సేపు నవ్వకుండా ఉండటం అసాధ్యం అనేంతగా అప్పట్లో ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు మళ్ళి ఇన్నాళ్ళ తర్వాత ఆ టైటిల్ తో సినిమా చేయటం అంటే సాహసమే. అందులో ఆర్టిస్టులందరికి ఇప్పుడు వయసు మళ్ళింది. కొత్తగా తీస్తున్న ఈ మూవీ వాళ్ళెవరు లేకపోయినా ఆ పాత్రల తాలుకు ప్రభావం ఇంకా ప్రేక్షకుల మనసులో అలాగే మిగిలిపోయింది. పోలిక సహజంగా వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్న శ్రీనివాసరెడ్డి ఇది తనకు మరో బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అని నమ్మకంతో ఉన్నాడు. సోలో హీరోగా చేసిన జయమ్ము నిశ్చయమ్మురా పేరైతే ఇచ్చింది కాని ఆఫర్స్ తేలేదు. అందుకే జంబలకిడిపంబతో తిరిగి తన సత్తా చాటుతానన్న శ్రీనివాసరెడ్డి రెగ్యులర్ సినిమాల్లో అవకాశాలు మాత్రం వదులుకోను అంటున్నాడు. అదే మరి సమయస్పూర్తి అంటే.