Begin typing your search above and press return to search.

గుర్రాన్ని బలవంతంగా తాగించలేం!!

By:  Tupaki Desk   |   19 Oct 2015 11:30 AM GMT
గుర్రాన్ని బలవంతంగా తాగించలేం!!
X
విడిపోయిన ఇద్దరిని బలవంతంగా కలిపినా.. ఆ బంధం ఎంతో కాలం ఉండదు. అది భార్యాభర్తలైనా, ఇంకే రిలేషన్ అయినా. నేమ్-హిట్ క్రెడిట్స్ పై గొడవ పడి పబ్లిక్ గానే తిట్టుకున్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల, రైటర్ కోన వెంకట్ లు. ఆ తర్వాత కోన లేకుండా తీసిన ఆగడు ఫెయిల్ కావడంతో.. అప్పటికే కమిట్ మెంట్ ఇచ్చిన చరణ్.. ఇద్దరూ కలిసి పని చేసేలా ఒప్పించాడు.

ఇష్టం లేకపోయినా వైట్ల-కోనలను కలిపాడు కానీ.. ఈ ఇద్దరూ కలిసి మళ్లీ అద్భుతాలేం చేయలేదు. సరికదా.. తిరిగి రామ్ చరణ్ కే పంచ్ ఇచ్చినట్లయింది పరిస్థితి. ఒకవేళ వాళ్లిద్దరూ కలిసిపోయి ఉంటే.. అవన్నీ పాత విషయాలు అని తీసిపారేసేవారు. కానీ బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లోనే విబేధాలన్నీ అలానే ఉన్నాయనే విషయం అర్ధమైంది. ఐ హేట్ శ్రీను వైట్లతో మొదలెట్టి.. రైటర్ స్టయిల్లో ఫినిషింగ్ ఇచ్చాడు కోన. ఇద్దరు మనుషులు గొడవపడితే.. వాళ్లకు నచ్చచెప్పే గొప్ప మనస్తత్వం చరణ్ ది అన్నాడు వైట్ల. ఈ ఇద్దరూ ఏ ఒక్క విషయాన్ని వదలిపెట్టలేదని ఇక్కడే అర్ధమవగా.. ఆ సంగతి బ్రూస్ లీ చూస్తున్నపుడు అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండాల్సిన వైట్ల-కోన మూవీలో.. అలాంటి ఊసే లేనట్లుగా అనిపిస్తుంది బ్రూస్ లీ. మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోవడానికి కారణం ఇదే అని ఇప్పటికే తేల్చేశారు క్రిటిక్స్. బలవంతంగా చరణ్ తమ ఇద్దరినీ ఒప్పించాడని చాలాసార్లు ఓపెన్ గానే చెప్పారు ఇద్దరూ. ఇప్పుడు పరిస్థితి కనిపిస్తోంది. ఇష్టంలేకుండా కలిపి వర్క్ చేయించచ్చు గానీ.. రిజల్ట్ రాబట్టలేమనే విషయం అర్ధమవుతోంది. అందుకే అంటారు గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్లగలం గానీ.. బలవంతగా తాగించగలమా అని.